పవన్‌వి టైంపాస్ రాజకీయాలు, ఉండవల్లి రిటైర్డ్ టీచర్, జెపి విఫలనేత: కత్తి మహేష్ సంచలనం
Recommended Video

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై రాజకీయ విశ్లేషకులు కత్తి మహేష్ మరోసారి ధ్వజమెత్తారు. టైమ్ పాస్ రాజకీయాలు మానుకోవాలని పవన్ కళ్యాణ్‌కు కత్తి మహేష్ సూచించారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఢిల్లీలో ఆంధోళనకు సిద్దమైతే మేమంతా మీ వెంట ఉంటామని కత్తి మహేష్ పవన్‌కళ్యాణ్‌కు తేల్చి చెప్పారు
ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని ఎంపీలు ఆందోళన చేశారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టిడిపి కూడ బిజెపి తీరుపై గుర్రుగా ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని టిడిపి నేతలు బిజెపిని నిలదీస్తున్నారు.
ఈ తరుణంలో జెఎసి ఏర్పాటు చేయాలని జనసేన చీప్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పవన్ కళ్యాణ్ చర్చించారు.మరో వైపు ఏపీకి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చారనే విషయమై లెక్కలు ఇవ్వాలని టిడిపి, బిజెపి నేతలను పవన్ కళ్యాణ్ కోరడాన్ని విమర్శకులు కత్తి మహేష్ తప్పుబట్టారు.ఈ మేరకు తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకొన్నారు. ఓ వీడియోను పోస్ట్ చేశారు కత్తి మహేష్.

టైమ్‌పాస్ రాజకీయాలు మానుకోవాలి
ఏపీకి నిధులిచ్చామని బిజెపి, ఇవ్వలేదని టిడిపి నేతలు చెబుతున్నారని రాజకీయవిశ్లేషకులు కత్తి మహేష్ గుర్తు చేశారు.ఏపీకి ఏ మేరకు నిధులు ఇచ్చారనే విషయమై పబ్లిక్ డొమైన్‌లో చూసుకోవాలని ఇప్పటికే టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పిన విషయాన్ని కత్తి మహేష్ గుర్తు చేస్తున్నారు.జెఎసి ఏర్పాటు విషయమై తాను స్వాగతించానని ఆయన చెప్పారు. కానీ, నిధులు ఎన్ని ఇచ్చారు, ఎన్ని నిదులను ఇంకా రావాల్సి ఉందనే విషయమై తీరిగ్గా లెక్కలు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని కత్తి మహేష్ ప్రశ్నించారు. దీని వల్ల సమయం వృధా అవుతోందని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. టైమ్ పాస్ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ పూనుకొన్నారనే అభిప్రాయాన్ని కత్తి మహేష్ వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ధర్నా చేయండి మేమొస్తాం
ఏపీ రాష్ట్రానికి కేంద్రం గతంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తే తామంతా మీ వెంట నడుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు రాజకీయ విశ్లేషకులు కత్తి మహేష్ సూచించారు. ఎన్నికల ముందు , ఎన్నికల తర్వాత ఇచ్చిన హమీలు ఏ మేరకు నెరవేరాయో అందరికీ తెలుసునన్నారు. కనీసం ఈ హమీలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు నిర్వహిస్తే ప్రజలు మీ వెంట ముందుకు వస్తారని కత్తి మహేష్ సూచించారు.

రిటైర్డ్ టీచర్, అమాయకపు స్టూడెంట్
ఏపీకి కేంద్రం నుండి వచ్చిన నిధులు, కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల విషయాన్ని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి అందిస్తే వాస్తవాలు ఏమిటో తేలుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని రాజకీయ విశ్లేషకులు కత్తి మహేష్ తప్పుబట్టారు. ఈ వివరాల కోసం ఆర్‌టిఐ కింద ధరఖాస్తు చేసినా ప్రయోజనం ఉంటుందన్నారు.ఈ కమిటీ ఏర్పాటు వల్ల కాలయాపన అవుతోందన్నారు. ఈ కమిటీ వల్ల ఏపీ ప్రజలకు ఏం ఉపయోగం ఉండదని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. రిటైర్డ్ టీచర్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ ను , అమాయకపు స్టూడెంట్‌గా పవన్ కళ్యాణ్‌ను కత్తి మహేష్ పోల్చాడు.

ఉద్యమాలకు జెపి పనికిరాడు
జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లో ఫెయిలయ్యారని రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ అబిప్రాయపడ్డారు. గతంలో అధికారిగా పనిచేసిన జయప్రకాష్ నారాయణ సలహలు, సంప్రదింపుల కోసం మాత్రమే పనికొస్తారని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. కానీ ఉద్యమాలకు జయప్రకాష్ నారాయణ పనికిరాడని కత్తి మహేష్ తేల్చి చెప్పారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications