పార్టీది సమైక్య వైఖరే: ఎర్రబెల్లికి పయ్యావుల కౌంటర్

తన స్థానం పార్టీలో ఏమిటనేది అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజలు చెప్తారని ఆయన అన్నారు. తనను ఎవరు బాధించినా, అవమానించినా తన విధానం మారదని ఆయన స్పష్టం చేశారు. తనకు జరిగిన అవమానం సీమాంధ్ర ప్రజల బాధల ముందు చాలా తక్కువదని ఆయన అన్నారు. ఏది సరైందనేది చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
పార్టీలో ఎక్కువ మంది సమైక్యవాదం వినిపిస్తున్నారని ఆయన అన్నారు. తనకు జరిగిన అవమానం చాలా చిన్నదని, చిన్న విషయాలను పట్టించుకుని తన లక్ష్యం నుంచి దృష్టిని మరలించదలుచుకోలేదని ఆయన అన్నారు. తాను సమైక్యవాదాన్ని కొత్తగా వినిపించడం లేదని, డిసెంబర్ నుంచే తాను సమైక్యవాదాన్ని వినిపిస్తున్నానని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో పార్టీ స్వరం మారుతోందనే భయంతో ఎర్రబెల్లి దయాకర్ రావు తనపై వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన అన్నారు. పార్టీలో సమైక్యవాదాన్ని వినిపించే హక్కు తనకు ఉందని, తెలంగాణ నేతలు వారి వైఖరి గురించి మాట్లాడినప్పుడు తాము ఏమీ అనలేదని, వారు కూడా అదే విధంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications