చేరికలపై కేశవ్ హెచ్చరిక, జగన్‌కి అదితప్ప తెలియదని..

బిజెపితో పొత్తుతోనే అభివృద్ధి సాధ్యమని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఇన్నాళ్లు జెండా మోసిన వారికి న్యాయం జరగాలన్నారు. అదే సమయంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. జగన్‌కు వ్యాపారం, దోపిడీ తప్ప పాలన గురించి అంతగా తెలియదన్నారు.
కెసిఆర్ విలవిల: రావులపాటి
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంధించిన బిసి రామబాణానికి కెసిఆర్ విలవిలలాడుతున్నారని రావులపాటి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కెసిఆర్‍ది రాజకీయ ఆరాటం అన్నారు. కెసిఆర్‌కు అధికార దాహం పట్టుకుందని, అందుకే ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.
పునర్ నిర్మాణం అంటే: దేవేందర్
తెలంగాణ పునర్ నిర్మాణం అంటే కొల్లగొట్టి మళ్లీ కట్టడమా అని రాజ్యసభ సభ్యులు, టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తెరాసను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో విద్యుత్, నీరు, నిరుద్యోగం పైన చర్చ జరగాల్సి ఉందన్నారు. విభజన తీరు సరిగా లేదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో అందరు భాగస్వామ్యం కావాలన్నారు. టిడిపికి అండగా బిసిలు అందరు కలిసి రావాలని కోరారు.












Click it and Unblock the Notifications