పార్లమెంట్ హౌస్ లో మెరిసిన మిథున్ రెడ్డి- ఎల్లుండి సరెండర్..

Vice President of India: ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్ది సేపటి కిందటే ఆరంభమైంది. పార్లమెంట్ సభ్యులు 15వ ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటోన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ బరిలో దిగారు. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలిపింది ఇండియా బ్లాక్. ఈ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున మొదట ఆయనే ఓటు వేశారు. ఉదయం సరిగ్గా 10 గంటలకు పార్లమెంట్ హౌస్ కు చేరుకున్నారు. ఆ వెంటనే ఓటు వేశారు. పలువురు కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. లోక్ సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ.. ఓటు వేశారు.

Peddireddy Mithun Reddy cast his vote for the Vice Presidential election

తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయమే ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు. అనంతరం పార్లమెంట్ హౌస్ కు వచ్చారు. ఆ సమయంలో ఆయన వెంట వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మద్దిళ్ల గురుమూర్తి ఉన్నారు.

పార్లమెంట్ హౌస్ కు చేరుకున్న ఆయనను పలువురు ఎంపీలు పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డితో కలిసి పార్లమెంట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. ఓటు వేశారు. ఈ ఎన్నికలో ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సీపీ రాధాకృష్ణన్‌ కు మద్దతుగా ఓటు వేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎంపీలకు సూచించారు.

కాగా- మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టయ్యారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు. లోక్ సభ సభ్యుడు కావడం, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అవసరం రావడం వల్ల న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎల్లుండి అంటే ఈ నెల 11వ తేదీన ఆయన సరెండర్ కావాల్సి ఉంది. రెగ్యులర్ బెయిల్ కోసం మిథున్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై ఈ నెల 12వ తేదీన మలి విడత వాయిదా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+