చంద్రబాబుకు ఎదురొడ్డి నిలిచి గెలిచిన ఏకైక మొనగాడు
ఏపీ రాజకీయ ఫలితాలు ఏకపక్షంగా సాగాయనే చెప్పాలి. గత ఎన్నికల్లో 151 సీట్లలో అధికారంలోకి వచ్చిన వైసీపీ..ఈసారి జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి రావడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. రాయలసీమ జిల్లాలో సైతం వైసీపీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. అయితే కూటమి ఎంత గొప్ప విజయం సాధించినప్పటికీ ఒక చోట మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది.
వైసీపీ కీలక నేతలను, మంత్రులను ఓడించారు కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని మాత్రం ఓడించలేకపోయారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు సమకాలీకుడుగా పేరు గాంచిన పెద్దిరెడ్డి ఆయనతో సమానంగా జిల్లాలో పేరు సాధించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి జిల్లాలో తన పట్టు నిలుపుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని సవాల్ విసిరారు.

ఇదే సమయంలో చంద్రబాబు సైతం అదే స్థాయిలో పెద్దిరెడ్డి ఏమైనా పుండిగా అంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. రాష్ట్రం మొత్తం కూటమి గాలి విచినప్పటికి ..పుంగనూరులో మాత్రం పెద్దిరెడ్డి విజయం సాధించారు. పెద్దిరెడ్డి విజయాన్ని మూడు పార్టీలు కలిసి కూడా అడ్డుకోలేకపోయాయి. ఇదే సమయంలో ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా విజయం సాధించి మరోసారి జిల్లాలో తన పట్టును నిలుపుకున్నారు.












Click it and Unblock the Notifications