• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జ‌గ‌న్ కు ఛాన్స్ ఇవ్వ‌ద్దు : చ‌ంద్ర‌బాబు న‌యా ప్లాన్ : క‌్రెడిట్ ఎవ‌రికి ద‌క్కేను..!

|

సుదీర్ఘ పాద‌యాత్ర‌. న‌వ‌రత్నాల ప్ర‌క‌ట‌న‌. అధికారంలోకి వ‌స్తే వెంట‌నే పెన్ష‌న్ రెండు వేల‌కు పెంచుతాం..ఇదీ 14 నెల ల పాద‌యాత్ర‌లో ప్ర‌తీ చోటా జ‌గ‌న్ ఇచ్చిన హామీ. అస‌లు..జ‌గ‌న్ కు ఎందుకు అవ‌కాశం ఇవ్వాలి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే చేస్తామంటున్నారు. చంద్ర‌బాబు న‌యా ప్లాన్‌. మ‌నం అధికారంలో ఉన్నాం..ముందు మ‌న‌మే పెంచేద్దాం. జ‌గ‌న్ కు చాన్స్ ఇవ్వ‌ద్దు అంటున్నారు చంద్ర‌బాబు. మ‌రి..ఇప్పుడు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం అమ‌లు చేస్తే ఆ క్రెడిట్ ఎవ‌రికి ద‌క్కేను. ప్ర‌క‌టించిన జ‌గ‌న్ కా..అమ‌లు చేస్తున్న చంద్ర‌బాబుకా...

జ‌గ‌న్ నినాదం అది..బాబు ఆయుధంగా..

జ‌గ‌న్ నినాదం అది..బాబు ఆయుధంగా..

జ‌గ‌న్ పార్టీ ప్లీన‌రీలో త‌న ఎన్నిక‌ల హామీల‌ను ముందుగానే ప్ర‌క‌టించారు. తాను అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేసే నవ రత్నాల‌ను ప్ర‌క‌టించి..వాటికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని పార్టీ శ్రేణుల‌ను ఆదేశించారు. అందులో భాగంగానే.. తాను అధికారంలోకి రాగానే ప్ర‌స్తుతం ఇస్తున్న వితంతు..వృద్దాప్య పెన్ష‌న్ల‌ను రెండు వేల‌కు పెంచుతాన‌ని ప్ర‌క‌టించా రు. దీని పై ప్ర‌తీ స‌భలోనూ చెప్పుకొచ్చారు. ఇక‌, జ‌గ‌న్ ఇస్తున్న హామీల ప్ర‌భావం పై టిడిపి అప్ర‌మ‌త్త‌మైంది. జ‌గ‌న్ ఇస్తున్న హామీల్లో ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేస్తున్న అంశాల పై నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారం సేక‌రించింది. అందు లో పెన్ష‌న్ల పెంపు అంశం పై సానుకూల‌త ఉన్న‌ట్లుగా గుర్తించింది. తాము అధికారంలోకి రాగానే 200 గా ఉన్న పెన్ష‌న్ ను వెయ్యి రూపాయాలు చేసాం. ఇప్పుడు జ‌గ‌న్ రెండు వేల‌కు పెంచుతామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. జ‌గ‌న్ కు ఎందుకు ఆ క్రెడిట్ ద‌క్కాలి. అధికారంలో ఉన్న మ‌ననే ఈ నిర్ణ‌యం అమ‌లు చేసి ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ద‌క్కించుకుందామ‌ని చంద్ర బాబు అత్యంత ముఖ్యుల‌తో షేర్ చేసుకున్నారు. ఫ‌లితంగా..ఎన్నిక‌ల షెడ్యూల్ లోగానే పెన్ష‌న్ల పెంపును ప్ర‌క‌టించి.. వెంట‌నే అమ‌లు చేసేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు.

పెన్ష‌న్ రెట్టింపు..వెంట‌నే అమ‌లు..!

పెన్ష‌న్ రెట్టింపు..వెంట‌నే అమ‌లు..!

రాజ‌కీయంగా ఓట్లు కురిపించే ఈ ప‌ధ‌కం పై ప్ర‌తిప‌క్షానికి ఎటువంటి అవ‌కాశం ఇవ్వ‌కూడద‌ని ముఖ్య‌మంత్రి గ‌ట్టి నిర్ణ యం తో ఉన్నారు. వెంట‌నే పెన్ష‌న్ల పెంపు కార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం పై ప‌డే భారం పై లెక్క‌లు ఆరా తీసారు. భారీగా భారం పెరుగుతుంద‌ని అధికారులు నివేదించినా..రాజ‌కీయంగా ఈ నిర్ణ‌యం అనివార్య‌మ‌ని సీయం భావిస్తున్నారు. దీంతో.. వివిధ వర్గాలకు ఎన్టీఆర్‌ భరోసా పేరుతో ఇస్తున్న సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని ఫిబ్రవరి నుంచి రెట్టిం పు చేయాలని నిర్ణ‌యించారు. జనవరి నుంచే పెంపును అమల్లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారు. అలా అమ లు చేసినట్లైతే ఫిబ్రవరిలో జనవరికి సంబంధించిన పెంపు మొత్తం కూడా అందజేస్తారు. దీంతో వృద్ధాప్య, వితంతువు లకు పింఛను మొత్తం నెలకు రూ.2,000 చెల్లించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లు కలిపి 50,61,906 మందికి పంపిణీ అవుతున్నాయి. వీటిపై నెలకి రూ.560కోట్లు చొప్పున ఏడాదికి రూ.6,720కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అన్నిరకాల పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తే నెలకి రూ.1,120కోట్లు, ఏడాదికి రూ.13,440కోట్లు చొప్పున వెచ్చించాలి. జ‌న్మ‌బూమి ద్వారా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను సైతం క‌లుపుకుంటే మొత్తం పింఛన్ల సంఖ్య 55.16లక్షలకు చేరుతుంది.

క్రెడిట్ ఎవ‌రికి ద‌క్కేను..ఓట్లు ఎవ‌రికి వ‌చ్చేను..!

క్రెడిట్ ఎవ‌రికి ద‌క్కేను..ఓట్లు ఎవ‌రికి వ‌చ్చేను..!

పెన్ష‌న్లు పెంపు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌క‌టించారు..ముఖ్య‌మంత్రి వెంట‌నే అమ‌లు చేసి చూపించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో..పెన్ష‌న్ల పెంపు తో వ‌చ్చే రాజ‌కీయ‌ల మైలేజ్ ఎవ‌రికి ద‌క్కుతుంది..ప్ర‌క‌టించిన జ‌గ‌న్ కా..లేక అమ‌లు చేస్తున్న చంద్ర‌బాబు కా..ఇప్పుడు ఇదే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి క‌ర‌మైన చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వం ముందుగానే ఈ పెన్ష‌న్ల‌ను అమ‌లు చేస్తుంద‌నే స‌మాచారం అందుకున్న జ‌గ‌న్ అప్పుడే దీని పై స్పందించారు. అనంత‌పురం లోని ధ‌ర్మ‌వ‌రం స‌భ‌లో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పెన్ష‌న్ల‌ను రెట్టిం పు చేసి..అమ‌లు చేసినా..ఆ క్రెడిట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని జ‌గ‌న్ నాడు చెప్పుకొచ్చారు. అయితే, టిడిపి నేత‌లు మాత్రం అధికారంలోకి వ‌స్తాడో..రారో..వ‌చ్చినా అమ‌లు చేస్తారో లేదో తెలియ‌ని జ‌గ‌న్ హామీ కంటే..అమ‌లు చేస్తున్న త‌మ‌నే ప్ర‌జ లు ఆశీర్వ‌దిస్తార‌ని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్ర‌బాబు ఏ హామీని అమ‌లు చేయ‌ర‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో విస్తృతం గా ప్ర‌చారం చేస్తున్నారు. ఆర్దికంగా భార‌మైనా..రాజ‌కీయంగా మైలేజ్ రావాలంటే వెంట‌నే పెన్ష‌న్ల‌ను రెట్టింపు చేయాల ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించారు. దీని ద్వారా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌చారం విలువ లేకుండా పోతుంద‌ని భావిస్తున్నారు. మ‌రి.. ఓట్ల రాజ‌కీయంలో ఎవ‌రికి ఈ క్రెడిట్ ద‌క్కుతుందో చూడాలి.

English summary
In his recently concluded padayatra YCP Chief Jagan Reddy had given many promises Which he assumes that his party would come to power. In this backdrop AP CM Chandrababu is of the opinion that he should be the one to give all the freebies while in power and attain the power in the coming elections. Thus stopping Jagan in all means from coming into power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X