పవన్ కల్యాణ్‌కు చిరంజీవి కంటే చంద్రబాబు అంటేనే ఇష్టం

మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ ప్రముఖ వార్త ఛానెల్‌ల్లో మాట్లాడిన ఆయన రాష్ట్ర రాజకీయాల గురించి తనదైనశైలిలో స్పందించారు. పవన్ అంటే నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ధ్వేషం లేదని.. ఆయన భార్య గురించి కూడా తాను ఎప్పుడు మాట్లాడలేదని పేర్ని నాని తెలిపారు.

ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాత్రమే స్పందించానని ఆయన ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఓ రాజకీయ పార్టీ పెడితే పార్టీ సిద్ధంతాల కోసం పాటుపడాలి. ఇంకో వ్యక్తి ప్రయోజనం కోసం కాదు. చంద్రబాబు కోసం పవన్ పార్టీ పెట్టారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. చంద్రబాబును రాజకీయంగా కాపాడటానికే పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించారని ఆయన ఎద్దెవా చేశారు. చిరంజీవి కంటే కూడా చంద్రబాబు అంటేనే పవన్ కళ్యాణ్ ఇష్టమని పేర్ని నాని తెలిపారు.

perni nani fires on janasena chief pawan kalyan

పవన్‌ను నేనేప్పుడూ కాపు అని తిట్టలేదు. పవన్ ఒక ఆడియో ఫంక్షన్లో నాపై అసభ్యకరంగా మాట్లాడారు. ఆయన తిడితే.. నేను తిడతానని ఆయన చెప్పుకొచ్చారు.బూతులు ఆయనే మాట్లాడతారు.. మమ్మల్ని బూతుల మంత్రి అని అంటారు ఇద్దెక్కడి న్యాయమంటూ పేర్ని నాని ప్రశ్నించారు. ఇక కాపుల గురించి మాట్లాడుతూ..కాపులు ఎవరి గుత్త సొత్తు కాదు. వారికి ఆలోచన శక్తి ఉంది కాపులందరూ పవన్ కల్యాణ్ వైపు లేరు. అన్ని కులాల వాళ్లు ఒకే వైపు ఉండరు.

మెజార్టీ కాపులు మాతోనే ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి ద్వారా మంచి జరుగుతుందని భావించే వారు ఆయన్ని విడిచి వెళ్లరని పేర్ని నాని పేర్కొన్నారు. మా కులానికి చెందిన వ్యక్తి సీఎం అవుతున్నారులే అనుకోవడానికి కూడా అవకాశం లేకుండా పవన్ కల్యాణ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కాపులు ఎందుకు ఓటేస్తారని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ఇక ఈ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్న పేర్ని నాని..ఈసారి ఎన్నికల్లో ఆయన తనయుడు పేర్ని కిట్టును రంగంలోకి దించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+