వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్: సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు: ఇదే లాస్ట్ ఛాన్స్: వాయిదా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటీషన్‌పై తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొంది. 26వ తేదీ నాటి విచారణ సమయానికి తప్పనిసరిగా కౌంటర్‌ను దాఖలు చేయాలని న్యాయస్థానం వైఎస్ జగన్‌ను ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి మరో అవకాశం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించింది.

2DG drug: కరోనా కమ్మేసిన వేళ..అందుబాటులోకి: త్వరలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా2DG drug: కరోనా కమ్మేసిన వేళ..అందుబాటులోకి: త్వరలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన నరసాపురం లోక్‌సభ సభ్యుడు కే రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ అది. సీబీఐ న్యాయస్థానం ఇదివరకు వైఎస్ జగన్‌కు దాఖలు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వైఎస్ జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి, ఆయనపై నమోదైన ఆస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు ఇదివరకే సీబీఐ న్యాయస్థానంలో పిటీషన్ వేశారు.

 Petition seekig cancelation of bail for AP CM YS Jagan, was posted to May 26

దీన్ని విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం..కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులు, వైఎస్ జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. రెండు పక్షాలు కూడా కౌంటర్‌ను దాఖలు చేయలేదు. దానితో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. తాజా విచారణ సందర్భంలోనూ- కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ఇరు పక్షాల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈ సారి కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సీబీఐ న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలా ఎంతకాలం జాప్యం చేస్తారని ప్రశ్నించింది.

కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశాన్ని ఇస్తున్నామని తెలిపింది. విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ కావడం వల్ల దీని వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు తాజాగా వినిపిస్తోన్నాయి. రఘురామ అరెస్టు పట్ల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన స్పందించిన తీరును వైఎస్సార్సీపీ నాయకులు ఉదాహరణగా చూపిస్తున్నారు. రఘురామను ముందు ఉంచి-టీడీపీ నేతలు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని మండిపడుతున్నారు.

English summary
The petition filed by Narasapuram MP K Raghurama Krishnam Raju seeking cancelation of bail for Chief Minister YS Jagan Mohan Reddy was posted to May 26.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X