రూ. లక్ష పెడితే రూ.35 లక్షలు.. 3 ఏళ్లలోనే మిలియనీర్లను చేసిన షేరు!
స్టాక్ మార్కెట్లు కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఏ స్టాక్ లో పెట్టుబడి పెట్టాలో తెలియక, అవగాహన లేక పలువురు ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. తొందరపడి పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి పెట్టాలంటే ముందుగా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టుకుంటూ రావాలి. మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తుండాలి.
అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వస్తేనే కొంతవరకైనా లాభం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్న వారిలో కొంత మందికి అతి తక్కువ సమయంలోనే అదృష్టం వరిస్తుంటుంది. తక్కువ పెట్టుబడితోనే లక్షాధికారులవుతుంటారు. ఇలాంటి స్టాక్స్ చాలా ఉంటాయి. ఇటువంటివాటిని ముందుగానే గుర్తించి పెట్టుబడి పెట్టగలిగిన వారికే రిటర్న్స్ వస్తాయి. అలాంటి ఓ స్టాక్ మూడు సంవత్సరాల్లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఏకంగా 3504 శాతం పెరిగింది. ఆ స్టాక్ గురించి తెలుసుకుందాం.

పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ (PG Electroplast Limited) స్టాక్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ స్టాక్ 6.93 శాతం పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.1879.85ను తాకింది. స్టాక్ వాల్యూమ్ 7.12 శాతం పెరిగింది. పీజీ గ్రూప్‌నకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ. భారత ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ సెక్టార్‌లో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంటుంది.

ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం రూ. 33.81 కోట్లుగా నమోదైంది. విదేశీ సంస్థాగత మదుపరులు 1.97 శాతం నుంచి 3.13 శాతానికి తమ పెట్టుబడులను మళ్లించారు. ఏడాది కాలంలో ఈ షేరు ఏకంగా 104 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అలాగే గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఏకంగా 3,504 శాతం పెరిగింది. అంటే మూడు సంవత్సరాల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే వారికి ఇప్పుడు రూ. 35 లక్షల లాభం వస్తుంది. షేర్ల విలువ రూ. 36 లక్షలుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications