మత్తయ్య కేసు: కాల్‌డేటా ఇచ్చేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు నెలరోజులా!

విజయవాడ: జెరూసలేం మత్తయ్య కేసులోఏపీ సీఐడీ అడ్వాన్స్ పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాల్ డేటా ఇచ్చేందుకు నెల రోజుల సమయం పడుతుందని సర్వీస్ ప్రొవైడర్లు బుధవారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో ఈ కేసు విచారణను ఆగస్టు 3వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈలోగానే తమకు కాల్ డేటా కావాలని ఏపీ సీఐడీ అధికారులు కోరుతున్నారు. తదుపరి దర్యాఫ్తునకు కాల్ డేటా అత్యవసరమని ఏపీ సీఐడీ అధికారులు కోర్టులో అడ్వాన్‌డ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

Phone Tapping: CID ready to file counter petition on Service Providers petition

కాల్ డేటా ఇచ్చేందుకు నెల రోజుల సమయం ఎందుకని ఏపీ సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వీస్ ప్రొవైడర్ల పైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తక్షణమే కాల్ డేటా కావాలని కోరనున్నారు. ఓటుకు నోటు కేసు అనంతరం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+