వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి అసెంబ్లీ: రేవంత్ హల్‌చల్, బాబు నవ్వారు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు చేదు అనుభవాలు, జ్ఞాపకాలు మిగిలినా, సంక్షోభం నుంచే స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఐటి రంగ అభివృద్ధికి విశాఖపట్నం, తిరుపతిలో రెండు సమాచార సాంకేతిక విజ్ఞాన పెట్టుబడి (ఐటిఐఆర్) ప్రాంతాలు, విజయవాడ, అనంతపురంలో భారీ ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

శనివారం శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించిన తీరు తీవ్ర అసంతృప్తిని, చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు నెరవేరలేదని, అశాస్ర్తియ విభజన తీరు తెలుగు ప్రజల హృదయాలను గాయపర్చిందని, గాయాలు మానటానికి కొంతసమయం పడుతుందన్నారు.

రామచంద్రయ్య

రామచంద్రయ్య

ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం పైన కాంగ్రెసు పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సి రామచంద్రయ్య, రఘువీరా రెడ్డిలు దీనిపై స్పందించారు. మరోవైపు, చంద్రబాబుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సి రామచంద్రయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాసనమండలిలో ఇతర పార్టీల ఎమ్మెల్సీలను టిడిపిలో చేర్చుకునేందుకు చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.

సిఎం రమేష్

సిఎం రమేష్

ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం పైన విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే దానిని అధికార పార్టీ నేతలు కొట్టి పారేశారు.

కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నేతలు

గవర్నర్ ప్రసంగం నిస్సారంగా ఉందని ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి అన్నారు. హామీలన్నింటినీ ఎప్పుడు నెరవేరుస్తారో కాలపరిమితి చెప్పలేదన్నారు. రాష్ట్ర విభజన వల్ల జీత భత్యాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని నిందలు వేసేందుకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.

దేవినేని, కాల్వ

దేవినేని, కాల్వ

బీఏసీ సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు హాజరు కాకపోవడాన్ని టిడిపి నేతలు కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వర రావులు తప్పు పట్టారు.

రేవంత్

రేవంత్

శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో అక్కడకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వచ్చారు. ఆయన పలువురిని పలకరించారు. కావూరి కూడా వస్తున్న దృశ్యం.

జెడి శీలం

జెడి శీలం

శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో అక్కడకు వచ్చిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెడి శీలం.

పల్లె రఘునాథ్ రెడ్డి

పల్లె రఘునాథ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అభినవ దుర్యోధనుడిగా అభివర్ణించారు.

రేవంత్, చంద్రబాబు

రేవంత్, చంద్రబాబు

శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో అక్కడకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడుతున్న దృశ్యం.

రేవంత్, చంద్రబాబు

రేవంత్, చంద్రబాబు

శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో అక్కడకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడుతున్న దృశ్యం.

రేవంత్, చంద్రబాబు

రేవంత్, చంద్రబాబు

శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో అక్కడకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడుతున్న దృశ్యం.

రేవంత్

రేవంత్

శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో అక్కడకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వచ్చారు. బిజెపి నేతలతో రేవంత్ రెడ్డి.

రేవంత్

రేవంత్

శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో అక్కడకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వచ్చారు. ఎపి మంత్రి యనమల, నేత పయ్యావులతో రేవంత్ రెడ్డి.

English summary
Photos of Andhra Pradesh Assembly in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X