షాకిచ్చిన బాబు: జగన్ పార్టీ ఇలా చెప్తుంటే.. (పిక్చర్స్)

హైదరాబాద్: గ్రామాల్లో కిరోసిన్ ఆదా కోసం సౌరశక్తితో నడిచే లాంతర్లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ సౌరలాంతర్లకు అయ్యే ఖర్చులో ప్రభుత్వం 1000 రూపాయలు సబ్సిడీగా చెల్లిస్తుందని సమాచార మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు.

శాసన సభలో సోమవారం నాడు ఇంధన డిమాండ్‌పై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి తరఫున పల్లె రఘునాథ్ రెడ్డి జవాబు చెబుతూ.. ఈ సంవత్సరం 1500 లాంతర్లు సరఫరా చేశామని, మరో 4,500 లాంతర్లు సరఫరా చేస్తామన్నారు.

గిరిజన ఉపప్రణాళిక కింద మరో 5,000 లాంతర్లు పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం 115 లక్షల రూపాయలు వినియోగిస్తామన్నారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు సభకు గైర్హాజరవుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అసెంబ్లీ

అసెంబ్లీ

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సోమవారం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ కీలకమైన అంశాలపై చర్చ సమయంలో సిఎం చంద్రబాబునాయుడు సాచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని, సభ్యులు సభ దృష్టికి తెచ్చే సమస్యలను కనీసం వినే ఓపిక కూడా లేకపోతే ఎలాగని ప్రశ్నించారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

దీనివల్ల లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆరోపించారు. మరోవైపు దేశం శాసనసభ్యులు,మంత్రులు అదే పనిగా దివంగత నేత వైయస్‌పై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ

అసెంబ్లీ

సిఎం, మంత్రుల వ్యవహారశైలి చూస్తే వారు ఏదో మానసికవత్తిడిలో ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. కీలక చర్చల సమయంలో సిఎం సభలో ఉంటే కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ... కీలకమైన నీటిపారుదలశాఖపై చర్చ సమయంలో ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సభలో లేకపోవడం శోచనీయమన్నారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

ఖరీఫ్ ముగుస్తున్నా నాట్లుపడని ప్రస్తుత తరుణంలో ఇరిగేషన్ శాఖ ఏం చేయబోతుందో సభకు చెప్పాల్సి ఉందన్నారు. డిమాండ్లపై సమాధానమివ్వాల్సిన సమయంలో అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరగడం సబబుకాదన్నారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ దివంగతనేత వైఎస్ సిఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌పార్టీలో ఉండి అధికారం అనుభవించిన కొందరు పెద్దలు నేడు అదేపనిగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

ఈ లోకంలో లేని వ్యక్తిగురించి పదేపదే ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం భావ్యం కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత ఎన్టీఆర్ గురించి తాము ఇప్పటి వరకు ఒక్క మాటకూడా మాట్లాడలేదన్నారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

కోట్లాదిప్రజల ప్రజాభిమానాన్ని చూరగొన్న వైయస్‌పై విమర్శలు మాని నవ్యాంధ్ర ఏం చేయబోతున్నారో చెబితే బాగుంటుందని, లేదంటే వారిని ప్రజలు క్షమించబోరని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

ఇదిలా వుండగా సిఎం, మంత్రుల గైర్హాజరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు మీడియా పాయింట్ వద్ద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి మాట్లాడుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సభలోకి వచ్చి సభ్యులు చెప్పే సమస్యలను వినడం గమనార్హం.

అసెంబ్లీ

అసెంబ్లీ

మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన ధీటుగానే స్పందిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన టీడీపీ నిప్పులు చెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+