టిడిపితో శోభా నవ్వులు, జగన్ పార్టీ గుసగుస (పిక్చర్స్)

హైదరాబాద్: సోమవారం అసెంబ్లీలో అదే సీన్ రిపీట్ అయింది. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చించాలని తెలంగాణ ప్రాంత నేతలు, సమైక్య తీర్మానం చేయాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయడంతో ఉభయ సభలలో గందరగోళం ఏర్పడింది. దీంతో శాసన సభను స్పీకర్, మండలిని చైర్మన్ మంగళవారానికి వాయిదా వేశారు.

బిల్లు పైన సభ్యుల ఈ నెల 10వ తేదీలోగా తమ అభిప్రాయాన్ని చెప్పాలని సభాపతి సూచించారు. బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటామని, సవరణల పైన ఓటింగ్ ఉంటుందన్నారు. సభ్యులు తమ అభిప్రాయాన్ని తెల్ల కాగితంపై రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలన్నారు. ఎలాంటి అఫిడవిట్లు, లెటర్ హెడ్స్‌ను తీసుకోమన్నారు. సభ్యులకు ఫార్మెట్‌ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

మరోవైపు, ఇరు ప్రాంతాల నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరకుండా కిరణ్, చంద్రబాబు, జగన్ అడ్డుకుంటున్నారని తెలంగాణ నేతలు మండిపడగా, వేర్వేరు పార్టీలకు చెందిన సీమాంధ్ర నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ నేతల ముచ్చట్లు

వైయస్సార్ కాంగ్రెస్ నేతల ముచ్చట్లు

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న సమయంలో సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడుకుంటున్న దృశ్యం.

జగన్ పార్టీ

జగన్ పార్టీ

మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న సమయంలో సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడుకుంటున్న దృశ్యం.

టిజి వెంకటేష్

టిజి వెంకటేష్

అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద సోమవారం మాట్లాడుతున్న రాయలసీమ ప్రాంత మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిల దృశ్యం.

మండలి 1

మండలి 1

శాసన మండలి వాయిదా పడిన అనంతరం అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత మండలి సభ్యులు అన్నదమ్ముల్లా విడిపోదాం, అన్యోన్యంగా కలిసుందామని ధర్నా చేపట్టారు.

మండలి 2

మండలి 2

అన్నదమ్ముల్లా విడిపోదాం, అన్యోన్యంగా కలిసుందామని శాసన మండలి ఎదుట జై తెలంగాణ నినాదాలు చేస్తూ కారును అడ్డుకుంటున్న ఎమ్మెల్సీలు.

మండలి 3

మండలి 3

శాసన మండలి వాయిదా పడిన అనంతరం అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత మండలి సభ్యులు అన్నదమ్ముల్లా విడిపోదాం, అన్యోన్యంగా కలిసుందామని ధర్నా చేపట్టారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యం.

మండలి 4

మండలి 4

అన్నదమ్ముల్లా విడిపోదాం, అన్యోన్యంగా కలిసుందామని మండలి ఎదుట ఆందోళన చేస్తుండగా, ఆ పక్కనే ఎమ్మెల్సీలు నల్లటి తలపాగాలు కట్టుకొని నిరసన తెలుపుతున్న దృశ్యం. పక్కన నన్నపనేని రాజకుమారి

మండలి 5

మండలి 5

సోమవారం శాసన మండలి వాయిదా పడిన అనంతరం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు, సీమాంధ్ర ఎమ్మెల్సీలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

మండలి 6

మండలి 6

సోమవారం శాసన మండలి వాయిదా పడిన అనంతరం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు, సీమాంధ్ర ఎమ్మెల్సీలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్న దృశ్యం. మీడియా ముందు పోటాపోటీ.

అసెంబ్లీ 1

అసెంబ్లీ 1

అసెంబ్లీ ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగి రెడ్డి, పక్కన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావులు.

అసెంబ్లీ 2

అసెంబ్లీ 2

అసెంబ్లీ ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులతో మాట్లాడుతున్న లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ. (జెపి ఉదయం జగన్ పార్టీపై మండిపడగా, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జెపి టిడిపి అజెండా అమలు చేస్తున్నారని విమర్శించారు.

అసెంబ్లీ 3

అసెంబ్లీ 3

అసెంబ్లీ ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులతో మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు.

జెపి

జెపి

వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యమంటూనే విభజనను కోరుకుంటోందని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు.

వాగ్వాదం

వాగ్వాదం

సోమవారం శాసన సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగి రెడ్డితో ఓ సభ్యుడి వాగ్వాదం.

స్నేహం

స్నేహం

సోమవారం శాసన సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగి రెడ్డి, టిటిడిపి నేత మోత్కుపల్లిలు మాట్లాడుకుంటున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+