వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే పౌరుషం:ఉబ్బితబ్బిబ్బై చిరు ఇంద్ర డైలాగ్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అధికారంలోకి రాకపోతే భవిష్యత్ ఉండదనే భయంతోనే హిట్లర్‌లాంటి గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని ఎపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరంజీవి విశాఖలో పర్యటించారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలుపని గట్టుకుని కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. పదవి వ్యామోహంతోనే కొందరు స్వార్థపరులు పార్టీని వీడి బయటకు వెళ్లారని, నిజమైన కార్యకర్తలు కాంగ్రెస్‌లోనే ఉన్నారన్నారు. ఎన్నికల తర్వాత జగన్ బిజెపితో కలుస్తారన్నారు.

మోడీ ఓ నియంత... బిజెపిని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడానికే పార్టీని వాడుకుంటున్నారని ఆరోపించారు. మతతత్వ మోదీ అధికారంలోకి వస్తే దేశానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. మోడీ వస్తే కార్పోరేట్ సంస్థలే రాజ్యమేలుతాయన్నారు.

చిరంజీవి

చిరంజీవి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఎపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి బుధవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మోడీ, చంద్రబాబు, జగన్‌ల పైన నిప్పులు చెరిగారు.

చిరంజీవి

చిరంజీవి

మీకు భూములిస్తా... మాకు నిధులు ఇవ్వండి... అంటూ రాష్ట్రంలో నీకిది.. నాకిది సంస్కృతిని జగన్ ప్రోత్సహించారని చిరు ఆరోపించారు. ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు.

చిరంజీవి

చిరంజీవి

రాజ్యాంగంలో మూడో అధికరణం ప్రకారం రాష్ట్రాన్ని విభజించవచ్చునంటూ వైయస్ జగన్ కేంద్రానికి లేఖ ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెసు పార్టీ పైన ఆయన విమర్శలు గుప్పించడమేమిటన్నారు.

చిరంజీవి

చిరంజీవి

మత్స్యకారులను ప్రోత్సహించేందుకు భీమిలి, శ్రీకాకుళంలో ఆ వర్గాల వారికి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇచ్చిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెసుదే అన్నారు.

చిరంజీవి

చిరంజీవి

కాంగ్రెసు జీవనది వంటిదని, దాన్ని భూస్థాపితం చేయడ ఎవరి తరం కాదని చిరంజీవి అన్నారు. పార్టీకి ఇలాంటి ఒడిదొడుకులు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు.

 చిరంజీవి

చిరంజీవి

మత్స్యకారులను ప్రోత్సహించేందుకు భీమిలి, శ్రీకాకుళంలో ఆ వర్గాల వారికి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇచ్చిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెసుదే అన్నారు.

చిరంజీవి

చిరంజీవి

కాంగ్రెసు జీవనది వంటిదని, దాన్ని భూస్థాపితం చేయడ ఎవరి తరం కాదని చిరంజీవి అన్నారు. పార్టీకి ఇలాంటి ఒడిదొడుకులు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు.

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి దక్షిణం, తూర్పు, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్డు షో నిర్వహించారు. దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో చిరంజీవి రోడ్డు షోకు భారీగా జనం వచ్చినా, తూర్పు, పశ్చిమ నియోజవర్గాల్లో మాత్రం అంతంతమాత్రమే అంటున్నారు.

చిరంజీవి

చిరంజీవి

ఈ రోడ్డు షోలో చిరంజీవితో పాటు టి సుబ్బిరామి రెడ్డి, ఎంపి అభ్యర్థి బొలిశెట్టి సత్యనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థులు ద్రోణంరాజు శ్రీనివాస్, ప్రభాగౌడ్, గుంటూరు భారతి వెంకటేశ్వరి, పేడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవి

చిరంజీవి

సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్న ఈసమయంలో చిరంజీవి ఆ పార్టీలో కొత్త ఆశలు రేపుతున్నారు. అదే సమయంలో చిరు సభలు వెలవెల పోవడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు.

చిరంజీవి

చిరంజీవి

తమ అభిమాన నటుడు తమ ముందుకు వచ్చేసరికి చిరంజీవి అభిమానులు పలుచోట్ల కేరింతలు కొట్టారు. దానికి చిరంజీవి కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు.

చిరంజీవి

చిరంజీవి

అభిమానుల ఉత్సాహం చూసి చిరంజీవి ఇంద్ర డైలాగ్ కొట్టారు. ఈలలు, చప్పట్లు తనకు ప్రాణవాయువు వంటివన్నారు. ఇంద్ర చిత్రంలోని అదే జోరు.. అదే హుషారు.. అదే పౌరుషం అనే డైలాగ్ కొట్టారు.

English summary
Union Tourism Minister Chiranjeevi tour in Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X