పోలీసుల వేధింపులతో రాజకీయాల్లోకి స్పీకర్! (పిక్చర్స్)
హైదరాబాద్: తాను డిగ్రీ చదువతున్న రోజుల్లో.. తన తండ్రి తవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చేర్పించామని, కోలుకొని నెల తర్వాత ఇంటికి వచ్చారని, రెండో రోజే దొంగ బంగారం కొన్నావంటూ పోలీసులు ఆయనను స్టేషన్‌కు తీసుకు వెళ్లి చిత్రహింసలు పెట్టారని, ఆ సంఘటన తన మనసుపై చెరగని ముద్ర వేసిందని, అన్యాయాన్ని ఎదిరించాలనే భావనే తనను రాజకీయాల్లోకి నడిపించిందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి బుధవారం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు రవీంద్రభారతిలో అభినందన సభ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి స్వర్ణకంకణం, వెండి కిరీటంతో సత్కరించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, వివక్షను ఎదిరించాలనే లక్ష్యంతోనే కేసీఆర్‌తో నడిచినట్లు చెప్పారు. అనేక ఆటుపోట్లు, అవమానాలకు గురయ్యానన్నారు. ఎట్టకేలకు తెలంగాణ సాధించుకున్నామన్నారు.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతో రాజకీయాలలోకి వచ్చి.. 1994లో తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యానని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటం సాగిస్తున్నానని, అయినప్పటికీ ఇదే పరిస్థితి నేటికీ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారులపై పోలీసులు, వడ్రంగులపై అటవీశాఖ అధికారుల వేధింపులు తప్పడం లేదన్నారు. ఈ ఇబ్బందుల నుండి బయటపడేలా సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

మధుసూదనాచారి
విశ్వ బ్రాహ్మణుల ఇంట్లో పుట్టిన తనకు వారి సమస్యలు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు అండగా ఉంటానని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు.

మధుసూదనాచారి
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తపించిన ఎన్టీఆర్, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన కేసీఆర్‌లను ఎప్పటికీ మరువలేనని ఆయన అన్నారు.

మధుసూదనాచారి
రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్పీకర్ మధుసూదనాచారిని బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలు అందని జాతి అని ఇప్పటి నుంచి అలాంటి పరిస్థితులు ఉండవని అన్నారు.

మధుసూదనాచారి
తాను రాజకీయాల్లోకి రావడానికి తన తండ్రి కులవృత్తి కొనసాగిస్తుంటే పోలీసుల వేధింపులకు గురయ్యేవాడని, ఇలాంటి సమస్యలు ఎవరూ ఎదుర్కోకూడదనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.












Click it and Unblock the Notifications