ఇదేం టీజర్ రా బాబు.. పుసుక్కున ఓపెన్ చేస్తే.. ఈ పిశాచి మైండ్ లోంచి పోవట్లే..!
టాలీవుడ్.. హాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీని అయినా శాసించే సబ్జెక్ట్స్ లో హార్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఒకటి.. హార్రర్ మూవీస్ కు భాషతో సంబంధం లేదు. ఏ భాషలో రిలీజ్ అయినా చూసేస్తుంటాం. అందుకే హారర్ సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇక ఇలాంటి హార్రర్ సినిమాలు థియేటర్ లో చూస్తే ఆ ఎక్స్ పీరియన్స్ డబుల్ రేంజ్ లో ఉంటుంది. త్వరలో టాలీవుడ్ లో అలాంటి సినిమానే రాబోతుంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే నోటమాట రావట్లేదు. ఆ సినిమానే సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మించిన చిత్రం 'హ్రీం' మూవీ..

టాలీవుడ్ లెజెండరీ కాంబో ఎస్వీ కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి ఈ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఈ మూవీలో పవన్ తాతా, చమింద వర్మ జంటగా నటించారు. 'హ్రీం' మూవీని రాజేశ్ రావూరి తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్ ఉత్కంఠభరితంగా చాలా అద్భుతంగా ఉంది. టీజర్ స్టార్టింగ్ లో లాహిరి లాహిరి లాహిరిలో అంటూ ఓ మహిళ చీకటిలో కూర్చుని పాడుతూ కనిపిస్తుంది. ఆ చేతులకు రక్తం ఉంటుంది. ఆ తర్వాత ఏదో కర్ణ, యక్షిణి అని ఏదోదో అంటున్నారు గురువు గారు, అలాంటి క్షుద్రశక్తుల గురించి మీరు తెలుసుకోకపోతేనే మంచిది, అంతం తర్వాత కూడా నువ్ నాకే సొంతం అనే డైలాగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
#HREEM official teaser 👌👌pic.twitter.com/EQ8Ojpmraa
— Milagro Movies (@MilagroMovies) June 23, 2026
'హ్రీం' మూవీ టీజర్ లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీలో తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటించారు. వరంగల్ దగ్గర పెద పెండ్యాల అనే ఊరిలో ఈ చిత్రం షూటింగ్ చేసినట్లు నిర్మాత తెలిపారు. కర్ణపిశాచి అనే అద్భుతమైన కోర్ పాయింట్ చుట్టూ సినిమా ఉంటుందని వివరించారు. ఈ చిత్రానికి అరవింద్ సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే రాజ్ పవన్ వీఎఫ్ ఎక్స్ బాధ్యతలు నిర్వహించారు. త్వరలోనే ఈ హారర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications