నమిత, రోజా.. హిజ్రాల భయం: తెలంగాణలో సమితి
హైదరాబాద్: గత ఐదు నెలలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ హిజ్రాలు భయాందోళనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వెంకట్ అనే పేరుగల రౌడీషీటర్ వారిని కనబడిన చోటల్లా బెదిరించి, భయపెట్టి, కొట్టి, విచక్షణారహితంగా పదునైన వస్తువులతో దాడి చేసి వారి వద్ద నుండి నగదును, ఆభరణాలను, విలువైన వస్తువులను దోచుకుంటున్నాడని చెబుతున్నారు.
జంట నగరాలలో జరుగుతున్న ఈ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకట్ అనే ఈ రౌడీషీటర్ సాధారణంగా హిజ్రాలు గుంపుగా సంచరించే ప్రాంతాల వద్ద కాపు కాసి వారిలో ఒకరిని కత్తితో లేదా మరో మారణాయుధంతో గాని చంపుతానని బెదిరించి మిగిలిన వారి వద్ద నుండి నగదు, విలువైన వస్తువులు అపహరిస్తున్నాడు.
గత ఐదు నెలల్లో ఈ రౌడీషీటర్ సుమారు ఏడు ప్రాంతాలలో ఇరవై మంది హిజ్రాలను దారుణంగా కొట్టి, హింసించి, దోచుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇతను దాడి చేసిన ప్రాంతాలలో కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, ఇందిరా నగర్, మెట్రో షాపింగ్ మాల్, ఫతేనగర్, బాలానగర్ ఉన్నాయి.
ఇప్పటి వరకు చేసిన దాడిలో రుక్మిణి అనే హిజ్రా పైన జరిగిన దాడి అత్యంత పాశివికమైనదిగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం రుక్మిణి ఇంటికి వెళ్లే దారిలో రాత్రి పది గంటల సమయంలో మెట్రో షాపింగ్ మాల్ వద్ద.. అడ్డగించి కత్తితో చాతి, కడుపు, రెండు చేతుల పైన దాడి చేశాడు.

హిజ్రాలు
మరునాడు మళ్లీ రుక్మిణిని అదే ప్రదేశంలో కిడ్నాప్ చేసి కాలికి ఉన్న పట్టగొలుసు ఒకటి తీసుకొని ఇంకొకటి తీయరాక పోవడంతో.. రుక్మిణి స్నేహితులకు ఫోన్ చేసి రూ.5వేల తీసుకు రమ్మని చెప్పాడు. రుక్మిణిని బెదిరించి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మారుతి వ్యాన్‌లో తిప్పి తిరిగి మెట్రో వద్ద వదిలి వెళ్లిపోయాడు.

హిజ్రాలు
హైటెక్ సిటీ వద్ద తానియా, ధనలక్ష్మి అనే హిజ్రాలను వెంబడించి వారి సెల్ ఫోన్లు తీసుకున్నాడు. అంతేకాక వారి ఇంటి యజమాని నుండి రూ.5వేలు తీసుకున్నాడు. కూకట్‌పల్లిలో యశోద అనే హిజ్రా వద్ద నుండి రూ.5వేలు తీసుకున్నాడు. అంతేకాక, ఇంటి నుండి గ్యాస్ సిలిండర్ తీసుకొని పరారయ్యాడు.

హిజ్రాలు
వెంకట్ భారిన పడిన ఇతర హిజ్రాల్లో నమిత, చంద్రముఖి, రేష్మ, అమృత, మోనాలిస, స్వీటీ, గౌరీ, భాను, రోజా, షబానా, లక్ష్మీకళలు ఉన్నారు. హిజ్రాల పెద్దలను బెదిరించి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బు వేయమని బెదిరిస్తున్నాడు. వెంకట్ పైన పలు పోలీసు స్టేషన్లలో హిజ్రాలు ఫిర్యాదు చేశారు.

హిజ్రాలు
కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్, హిజ్రాల సాధికారత, గౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ హిజ్రా ట్రాన్స్ జెండర్ సమితి (టీహెచ్‌టీఎస్) ఏర్పడింది. హిజ్రా, ట్రాన్స్ జెండర్ సమూహం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక బహిష్కరణలు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు టీహెచ్‌టీఎస్ ఈ నెల 10వ తేదీన ఇందిరా పార్కు వద్ద స్వాభిమాన సభ నిర్వహిస్తోంది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications