భీం: నేతల నివాళి, ఆదివాసీ మహిళల డ్యాన్స్(పిక్చర్స్)
హైదరాబాద్/అదిలాబాద్: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ 73వ వర్దంతి సందర్భంగా శుక్రవారం ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. ఆయన వర్థంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహించింది. ఐటిడిఏ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించారు.
ఆయన సమాధి ఉన్న జోడేఘాట్ ప్రాంతంలోనూ, హట్టిలోనూ జరిగిన కార్యక్రమాల్లో ఆయన మనవడు సోనేరావు, కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాధికి పక్కనే నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని సోనేరావు ఆవిష్కరించారు.
ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీమ్ పేరు పెట్టాలని గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పలువురిని హట్టి వద్దనే పోలీసులు నిలిపి వేశారు. జోడేఘాట్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హట్టి వద్ద జరిగిన సమావేశాన్ని బహిష్కరించారు. ఈటెల రాజేందర్, గుండా మల్లేశ్, ఎంపి రమేష్ రాథోడ్ తదితరులు కూడా పోలీసుల వైఖరిపై మండిపడ్డారు.

భీం 1
ఆదివాసీల హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరంభీమ్‌కు గిరిజనులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు.

భీం 2
అశ్వీజ పౌర్ణమి రోజు కొమురం భీమ్ జోడేఘాట్ అడవుల్లో అసువులు బాసి అమరుడు కాగా తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం జోడేఘాట్‌లోనే అధికారికంగా కార్యక్రమం నిర్వహించింది.

భీం 3
జోడే ఘాట్‌లో జరిగిన కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు , అరుణోదయ విమల, ప్రజాఫ్రంట్ నేత వేదకుమార్, ఉట్నూర్ ఆర్డీవో రాంచంద్రయ్య, ఎపి టూరిజం అధికారి మహేశ్, పలు సంఘాల గిరిజన నాయకులు పాల్గొన్నారు.

భీం 4
నిజాం దొరలపై సాయుధ పోరు జరిపిన కొమరం భీమ్‌కు నివాళులు అర్పించేందుకు ఈటెల రాజేందర్, గుండా మల్లేష్, రమేష్ రాథోడ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, గోడం నగేష్, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదేలు, వేణుగోపాలచారి, విమలక్కను జోడేఘాట్‌కు వెళ్ళనివ్వకుండా పోలీసులు మొదట అడ్డుకున్నారు.

భీం 5
నిజాం దొరలపై సాయుధ పోరు జరిపిన కొమరం భీమ్ సమాధి అదిలాబాద్ జిల్లా జోడేఘాట్ వద్ద ఉంది. ఐటిడిఏ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈసారి కార్యక్రమం నిర్వహించారు.

భీం 6
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరం భీమ్‌కు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు.

భీం 7
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరం భీమ్‌కు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న బిజెపి నేతలు.

భీం 8
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరం భీమ్‌కు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. సంప్రదాయ నృత్యం చేస్తున్న ఆదివాసీలు.

భీం 9
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరం భీమ్‌కు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు.

భీం 10
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరం భీమ్‌కు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల ఆయన విగ్రహానికి రాజకీయ నాయకులు, అధికారులు, ఆదివాసీలు నివాళులు అర్పించారు.

భీం 11
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరం భీమ్‌కు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల ఆయన విగ్రహానికి జిల్లా తోటి ఆదివాసి సేవా సంఘం నాయకులు నివాళులు అర్పించారు.

కొమరం భీమ్
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరం భీమ్‌కు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల ఆయన విగ్రహానికి ఆదివాసీలు నివాళులు అర్పించారు.

కొమరం భీమ్
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరం భీమ్‌కు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. సంప్రదాయ నృత్యం చేస్తున్న ఆదివాసీలు.

కొమరం భీమ్
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమరం భీమ్‌కు హైదరాబాదులోని ట్యాంకుబండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న బిజెపి నాయకులు.












Click it and Unblock the Notifications