పెళ్లి పనులు జరుగుతుండగా.. లవర్స్ సూసైడ్(పిక్చర్స్)
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సెన్నెల మండల కేంద్రంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. బోయవాడకు చెందిన స్రవంతి అనే 19 ఏళ్ల విద్యార్థిని ఇంటర్ వరకు బెల్లంపల్లిలో చదివింది. ఆ సమయంలో లింగంపల్లి తిరుపతి అనే 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.
ఇరవై రోజుల క్రితం అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు. ఈ నెల 26న పెళ్లి కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటుండగా.. పెళ్లికి ముందే అమ్మాయి ప్రియుడితో కలిసి ఇంటి నుండి వెళ్లి పోయింది. పది రోజులకు శవమై కనిపించింది. ఏడాది క్రితం ఇరువురు పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుండి వెళ్లిపోయారు.
అమ్మాయి తల్లిదండ్రులు వారిని వెతికి పట్టుకు వచ్చారు. ఆ తర్వాత అమ్మాయి చదువును మధ్యలోనే మాన్పించారు. ఇరవై రోజుల క్రితం అమ్మాయికి మహారాష్ట్రలోని సిరోంచ తాలుకలోని పెంటు పాక గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితో సంబంధం కుదిరింది. 26న పెళ్లి ఉంది.

ప్రేమికులు
పెళ్లి పనులు జరుగుతుండగా.. ఈ నెల 20న స్రవంతి ఇంటి నుండి బహిర్భూమికి అని వెళ్లింది. ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అనుమానంతో ప్రియుడు తిరుపతి ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అతను కూడా కనిపించలేదు.

ప్రేమికులు
శనివారం కొందరు యువకులు స్నానానికి అని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. బావిలో ఇద్దరి మృతదేహాలు తేలియాడటం చూసిన యువకులు గ్రామంలోకి వచ్చి సమాచారం ఇచ్చారు. గ్రామస్థులు తిరుపతి, స్రవంతి మృతదేహాలుగా గుర్తించారు.

ప్రేమికులు
దీంతో ఇరువురు కలిసి ఎటో వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. అదే రోజు సెన్నెల పోలీసు స్టేషన్‌లో తిరుపతిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం తిరుపతి కోసం అతని స్నేహితులను పట్టుకొని ఆరా తీశారు. వారి జాడ తెలియరాలేదు.

ప్రేమికులు
తిరుపతి ఎస్సీ, స్రవంతి బిసి అయినందున కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోరని భావించినందువల్లే వారు బావిలో పడి ఆత్మహత్య చేసుకొని ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications