బైరెడ్డి 3 ముక్కలు, చేతులు కట్టుకొని కిల్లి (పిక్చర్స్)
హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్య ఉద్యమం రెండు నెలలు దాటినా కొనసాగుతోంది. సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతోంది. బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో అన్ని జల్లాల్లో సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ రోజు సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలలో దీక్షలు ప్రారంభించారు.
సమైక్యవాదులు ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులను, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులను అడ్డుకుంటున్నారు. విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఎదుట సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు హైదరాబాదులోని సకల జనుల భేరీ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. విభజనకు కారకులంటా కెసిఆర్, కోదండరామ్, సోనియా గాంధీ తదితరుల బొమ్మలతో పోస్టర్లు రూపొందించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో సమైక్య ఉద్యమం రెండు నెలలుగా కొనసాగుతోంది. రోడ్లను దిగ్బంధించి అక్కడే డ్యాన్సులు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు.

అనంతపురం
అనంతపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్న సమైక్యవాదులు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు.

కర్నూలులో బైరెడ్డి
రాయలసీమ పరిరక్షణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కర్నూలులో మాట్లాడుతున్న దృశ్యం. రాష్ట్రాన్ని విడగొడితే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం విభజిస్తే మూడు ముక్కలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఒంగోలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో చౌరస్తాలో వాహనాలు నిలిపి సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేస్తున్న సమైక్యవాదులు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

శ్రీకారుళం
శ్రీకాకుళం జిల్లాలో బోనాలు ఎత్తుకున్న మహిళలు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళంలో మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి నిరసనలు తెలియజేశారు.

కిల్లి కృపారాణి
కేంద్రమంత్రి కిల్లి కృపారాణిని రాజీనామా చేయాలంటూ అడ్డుకున్న సమైక్యవాదులు. సమైక్యవాదులు చెబుతున్న విషయాన్ని చేతులు కట్టుకొని వింటున్న కృపారాణి.

జై సమైక్యాంధ్ర
సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళంలో మహిళల నిరసన. శ్రీ లలితా మండలి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని గుడివీధి మహిళలు లలితా మాత చిత్రంతో నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications