అంతా కేసీఆరే, బాబుని నిలదీస్తామని ఎర్రబెల్లి (పిక్చర్స్)
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల పైన ప్రభుత్వం స్పందించడం లేదని తెలంగాణ టీడీపీ నేతలు గురువారం ఢిల్లీలో ధ్వజమెత్తారు. రైతు, విద్యుత్ సమస్యల పైన రాష్ట్రం నుండి ఏ విధమైన నివేదికలు తమకు రాలేదని కేంద్రమంత్రులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. వారి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖమంత్రి రాధామోహన్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ తనను ఆ రాష్ట్రానికి పిలవలేదని, వాళ్లైనా వచ్చి తనను కలవలేదని, అయినప్పటికీ రైతుల ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ వెళ్లినప్పుడు తానే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యాననని, అధికారులతో చర్చించానని కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటే ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని, కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంటుందని చెప్పారు.
ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి నివేదికా అందలేదన్నారు. నివేదిక రాకుండా తామేమీ చేయలేమన్నారు. తెలంగాణలో రైతులను ఆదుకోవాల్సిందిగా తెలంగాణ టీడీపీ నేతలు రాధామోహన్ సింగ్‌ను కోరారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పెద్ద ఎత్తున రైతు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీవ్రంగా పరిగణించటం లేదని, తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

తెలంగాణ టీడీపీ నేతలు
రాష్ట్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై నివేదిక పంపితే కేంద్ర ప్రభుత్వ బృందాన్ని పంపిస్తామని, డిక్లరేషన్ కానీ, నివేదిక గానీ రాకపోతే తాము బృందాన్ని పంపించలేమని, ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రితో మాట్లాడుతామని, నివేదిక పంపించాలని కోరుతామని రాధామోహన్ సింగ్ చెప్పారు. ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా తాము బేధభావం చూపబోమని, రైతుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నామన్నారు.

తెలంగాణ టీడీపీ నేతలు
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వెళ్లిన నిధులను ఆయా రాష్ట్రాలు సరిగా వినియోగించటం లేదని రాధామోహన్ సింగ్ చెప్పారు. వ్యవసాయానికి నిధుల కొరత లేదన్నారు. అయితే ప్రభుత్వాలు వ్యవసాయంపై తగినంత శ్రద్ధ పెట్టకపోవడంవల్లే రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అది తెలంగాణ అయినా, మహారాష్ట్ర అయినా కేంద్ర పథకాలను సరిగా ఉపయోగించుకోవటం లేదన్నారు. కేంద్రం మొదలుపెట్టిన పథకాల వల్ల మరో 2,3 ఏళ్లలో పరిస్థితులు మారుతాయన్నారు.

తెలంగాణ టీడీపీ నేతలు
అసలు సమస్య కనీస మద్దతు ధర కాదన,ి దిగుబడి పెంపు ముఖ్యమన్నరు. తెలంగాణ, మహారాష్ట్రల్లో పంటలు పండించేందుకు నీళ్లే లభించటం లేదని, ఏ రకం విత్తనాలు వేస్తే పైరు బాగా వస్తుందో రైతులకు తెలియడంలేదని, ఏ సమయంలో ఎలాంటి పంట పండిస్తే అధిక దిగుబడి వస్తుందో వారికి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ టీడీపీ నేతలు
ఎక్కువ పంటలు పండే ప్రాంతాల్లో ఎఫ్‌సీఐ, సీసీఐలు ప్రాసెసింగ్ కేంద్రాలు నిర్మించి, అధికారులను నియమించాలని తెలిపారు. అలా జరగనప్పుడు భారీ స్థాయిలో మొక్కజొన్నలు ఉత్పత్తి అయితే వాటిని కొనుగోలు చేసి ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందని ప్రశ్నించారు.

తెలంగాణ టీడీపీ నేతలు
తమ విజ్ఞప్తికి కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు రమణ, ఎర్రబెల్లి తదితరులు అన్నారు. తెలంగాణ విద్యుత్తు కొరతకు చంద్రబాబే కారణమని సీఎం కేసీఆర్ అనడం తగదని, తమ అధినేత చేసిన తప్పేంటో చూపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యుత్తు కొరతకు ఏపీ ప్రభుత్వం తప్పు లేదన్నారు. ఏపీ ప్రభుత్వం తప్పు చేసినట్లు కేసీఆర్ నిరూపిస్తే తాము కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.












Click it and Unblock the Notifications