వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు అడ్డు తగిలారు: అసెంబ్లీ వద్ద ఆగ్రహం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రసంగిస్తుండగా మంత్రులతో పాటు అధికార పక్షానికి చెందిన సభ్యులు పదే పదే అడ్డుకునేందుకు, జవాబు చెప్పేందుకు ప్రయత్నించారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటి (బిఎసి)లో తీసుకున్న నిర్ణయం మేరకు బడ్జెట్‌పై జరిగే చర్చకు సంబంధించి మాట్లాడేందుకు ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండున్నర గంటల సమయం కేటాయించారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించారు.

బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ, సోమవారం ఉదయం 11 గంటలకు జగన్ ప్రసంగాన్ని ప్రారంభించి, ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా, అధికార పక్షం సభ్యులు అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నించారు. ఒక పర్యాయం ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో దోపిడి జరిగిందంటూ విమర్శించారు. 2004 లో కేవలం 11 లక్షల ఆస్తులు ఉన్నట్టు జగన్ ప్రకటించుకోగా, 2014లో జగన్ ఆస్తులు 43 వేల కోట్లకు ఎలా పెరిగాయో చెప్పాలన్నారు.

మరో పర్యాయం టిడిపి సభ్యుడు ధూళిపాల నరేంద్ర అడ్డుకుంటూ.. జగన్‌మోహన్‌రెడ్డి రుణమాఫీకి వ్యతిరేకి అని తేలిపోయిందన్నారు. ఇంకోసారి ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం ఏ పని చేసినా ప్రతిపక్షానికి తప్పుగానే కనిపిస్తుందన్నారు. జగన్ తన ధోరణి మార్చుకుని, రాష్ట్ర అభివృద్ధిలో కలిసి రావాలన్నారు. మరోసారి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుంటూ రుణమాఫీకోసం బడ్జెట్‌లో కొంత మొత్తం పొందుపరిచామంటూ వివరణ ఇచ్చుకున్నారు.

ఎన్నికల సమయంలో మానిఫెస్టో ద్వారా ప్రజలకు టిడిపి ఇచ్చిన అన్ని హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న భావన కల్పించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరో పర్యాయం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు జోక్యం చేసుకుంటూ, రాష్ట్రంలో గతంలో (కాంగ్రెస్ హయాంలో) దళితులకు చెందిన 16 లక్షల ఎకరాల భూమిని పెద్దలకు పంపిణీ చేశారంటూ ఆరోపించారు.

జగన్ ప్రసంగిస్తుండగా మంత్రులు, అధికార పక్షం సభ్యులు జోక్యం చేసుకోవడంతో అనేక పర్యాయాలు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగింది. జగన్ మాట్లాడుతుండగా మంత్రులు, అధికార పక్షం సభ్యులు అడ్డుకున్న ప్రతిసారి జగన్ మైక్ కట్ అయింది. దాంతో పలుపర్యాయాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. జగన్ మాట్లాడుతుండగా మైక్ కట్ కావడం పట్ల సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 1.45 గంటలకు జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, టిడిపి సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం కల్పించారు. జగన్ పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో సభను వాయిదా వేశారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. అసెంబ్లీ జగన్‌ జాగీరు కాదని, లోటస్‌పాండ్‌లోనో, పులివెందులలోనో వ్యవహరించినట్లు అసెంబ్లీలోనూ ఉంటానంటే కుదరదన్నారు.

అసెంబ్లీ

అసెంబ్లీ

ప్రధాన పతిపక్షనేతగా హుందాగా వ్యవహరించడంలో జగన్‌ విఫలమయ్యారని టీడీపీ ఎద్దేవా చేసింది. వ్యవహారశైలిలో చంద్రబాబుకు, జగన్‌కి నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

రాజకీయ హత్యలు చేసిన జగన్‌ తెలుగుదేశం హయాంలో హత్యలు పెరిగిపోయాయని ఆరోపించడం ఆయన చేసిన హత్యలను కప్పిపుచ్చుకునేందుకేనని మంత్రి ఘాటుగా విమర్శించారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

స్పీకర్‌ని గౌరవించడం లేదు సరికదా ఆయన పైనే విమర్ళలు చేయడం పట్ల జగన్‌ స్వభావం ఏమిటో అర్థమవుతుందని మరో టీడీపీ ధ్వజమెత్తింది. పదే పదే స్పీకర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసేలా మాట్లాడుతూ పులివెందుల రౌడీయిజం చేస్తే అసెంబ్లీలో సాగనివ్వబోమన్నారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభలో మాట్లాడుతుంటే అధికార పక్షం పదే పదే అడ్డుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండిపడుతోంది.

 అసెంబ్లీ

అసెంబ్లీ

హామీల విషయంలో చంద్రబాబు వరుసగా మాట మారుస్తూ పోతున్నారని, రుణమాఫీ చేసే మొత్తాన్ని ఎలా తగ్గించాలా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధ్వజమెత్తుతోంది.

 అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రసంగిస్తుండగా మంత్రులతో పాటు అధికార పక్షానికి చెందిన సభ్యులు పదే పదే అడ్డుకునేందుకు, జవాబు చెప్పేందుకు ప్రయత్నించారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటి (బిఎసి)లో తీసుకున్న నిర్ణయం మేరకు బడ్జెట్‌పై జరిగే చర్చకు సంబంధించి మాట్లాడేందుకు ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండున్నర గంటల సమయం కేటాయించారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ, సోమవారం ఉదయం 11 గంటలకు జగన్ ప్రసంగాన్ని ప్రారంభించి, ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా, అధికార పక్షం సభ్యులు అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నించారు. ఒక పర్యాయం ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో దోపిడి జరిగిందంటూ విమర్శించారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

2004 లో కేవలం 11 లక్షల ఆస్తులు ఉన్నట్టు జగన్ ప్రకటించుకోగా, 2014లో జగన్ ఆస్తులు 43 వేల కోట్లకు ఎలా పెరిగాయో చెప్పాలన్నారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

మరో పర్యాయం టిడిపి సభ్యుడు ధూళిపాల నరేంద్ర అడ్డుకుంటూ.. జగన్‌మోహన్‌రెడ్డి రుణమాఫీకి వ్యతిరేకి అని తేలిపోయిందన్నారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

ఇంకోసారి ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం ఏ పని చేసినా ప్రతిపక్షానికి తప్పుగానే కనిపిస్తుందన్నారు. జగన్ తన ధోరణి మార్చుకుని, రాష్ట్ర అభివృద్ధిలో కలిసి రావాలన్నారు.

English summary
YSR Congress president YS Jaganmohan Reddy led Opposition in Andhra Pradesh Assembly walked out on raising allegations of corruption by members of the ruling party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X