వరాలు: మహిళలు బాబును ఆదరించేనా (పిక్చర్స్)
విజయవాడ: ఎన్నికల్లో మహిళలు తలుచుకుంటే ఫలితాలను తారుమారు చేయగలరనేది పలుమార్లు రుజువైంది. వచ్చే ఎన్నికల్లో మహిళల మద్దతు పొందడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన గురువారంనాడు విజయవాడలో జరిగిన ప్రజాగర్జన సభలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.
మహిళలకు ఆయన సభలో వరాల జల్లు కురిపించారు. పండంటి బిడ్డ పథకాన్ని ప్రవేశపెడుతామని హామీ ఇచ్చారు. ఆడపిల్లల రక్షణ బాధ్యత తమదేనని ఆయన ప్రకటించారు. మహిళలపై అత్యాచారాలను అరికడతామని ఆయన చెప్పారు. తాము మహిళలకు సెల్‌ఫోన్లు ఇస్తామని, మీట నొక్కితే నిమిషాల్లో పోలీసులు వాలుతారని ఆయన చెప్పారు. ఇవన్నీ మహిళలను ఆకట్టుకోవడానికి ప్రకటించారు.
తనను అధికారంలోకి తెస్తే అవన్నీ చేసి చూపిస్తానని ఆనయ చెప్పారు. సీమాంధ్రలో తాను అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు వరుసగా ప్రజాగర్జన సభల్లో పాల్గొంటున్నారు. విజయవాడలో జరిగిన ప్రజాగర్జనకు పెద్ద యెత్తున మహిళలు తరలి వచ్చారు.

మహిళలు ఇలా..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న విజయవాడ ప్రజాగర్జన సభకు మహిళలు పెద్ద యెత్తున తరలి వచ్చారు.

చంద్రబాబు ర్యాలీ ఇలా..
విజయవాడలో నిర్వహించిన ప్రజాగర్జన సభకు హాజరు కావడానికి వచ్చిన చంద్రబాబు ఇలా ర్యాలీలో పాల్గొన్నారు.

మహిళలకు భరోసా..
మహిళలకు చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే తాము అమలు చేసే పథకాలను ఆయన వివరించారు.

ఎన్టీఆర్‌కు నివాళి..
ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తిహక్కు కల్పించారని, ఆ ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని, టిడిపి పాలనలోనే మహిళలకు రక్షణ ఉంటుందని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications