పేలని జ'గన్': ఓటమిని అంగీకరిస్తూ ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: సీమాంధ్రలో మూకుమ్మడి దాడిని ఎదుర్కోవడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విఫలమయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కటై జగన్ అవినీతిపై విరుచుకుపడుతుంటే తిప్పికొట్టడంపై ఆయన శ్రద్ధ పెట్టలేదని అనిపిస్తోంది. ప్రతిగా చంద్రబాబుపై పాత ఆరోపణలనే మళ్లీ మళ్లీ చేస్తూ వెళ్లారు. రెండెకరాల ఆసామీ కోట్లు ఎలా సంపాదించారని అడుగుతూ వెళ్లారు. కానీ తనపై చేసిన ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వలేకపోయారు.
మరోవైపు, కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా వైయస్ జగన్‌పై విమర్శలు చేశారు. సీమాంధ్ర కాంగ్రెసు ప్రచారానికి సారథ్యం వహించిన చిరంజీవి ఆయనపైనే విమర్శలు చేస్తూ వెళ్లారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చెబుకుంటూ వెళ్లారు. వైయస్‌పై ఉన్న అభిమానంతో మాత్రమే ఆయన విజయం సాధించాలని అనుకున్నారు. కానీ, సీమాంధ్రను ఎలా అభివృద్ధి చేస్తాననే విషయాన్ని చెప్పలేకపోయారు.
ఫలితాల విషయంలో ఆయన అతిగా కూడా అంచనా వేసినట్లు కనిపిస్తున్నారు. తనకు తిరుగులేని విజయం దక్కుతుందని ఆయన భావించారని చెప్పవచ్చు. పార్టీ నిర్మాణంపై శ్రద్ధ పెట్టకపోవడం కూడా వైఫల్యానికి కారణమైందని చెప్పవచ్చు.

వైసిపిలో నిస్తేజం
ఓటమితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో నిస్తేజం అలుముకుంది. ఏ మాత్రం సందడి కనిపించలేదు. లోటస్ పాండ్ ఇలా కనిపించింది.

వైసిపి కార్యాయం ఇలా..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం కూడా శుక్రవారం నిర్మానుష్యంగా కనిపించింది. పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు.

ఓటమిని అంగీకరిస్తూ...
ఫలితాలు వెలువడిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు.

ప్రతిపక్షంగానే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, ఐదేళ్ల తర్వాత తాను వస్తానని జగన్ చెప్పారు.

చంద్రబాబుపై నిందలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చి విజయం సాధించారని జగన్ విమర్శించారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications