వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కండువా కప్పారు, టికెట్లిచ్చారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇలా పార్టీలో చేరారు, అలా టికెట్లు దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన వెంటనే ఐదుగురు నాయకులకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు టికెట్లు ఇచ్చారు. ఐదుగురు నాయకులకు గులాబీ కండువా కప్పేసి, వారికి శాసనసభ టికెట్లు కూడా ఇచ్చారు.

హైదరాబాద్ నాయకులకు తెరాస టికెట్లు చాలా సులభంగా దక్కినట్లు కనిపిస్తున్నాయి. నలుగురు హైదరాబాద్‌కు చెందిన నాయకులు తెరాసలో చేరి, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులుగా ఎంపికయ్యారు. నల్లగొండ జిల్లా సిపిఎం నాయకుడు నోముల నర్సింహయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం తెరాసలో చేరారు.

నోముల నర్సింహయ్యకు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ టికెట్ దక్కింది. ఆయన నాగార్జునసాగర్ శాసనసభా స్థానంలో కాకలు తీరిన కాంగ్రెసు నేత కుందురు జానారెడ్డిని ఎదుర్కోనున్నారు.

కొలను హనుమంత రెడ్డి ఇలా..

కొలను హనుమంత రెడ్డి ఇలా..

కొలను హనుమంత రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్టీలో చేర్చుకుని కుత్బుల్లాపూర్ శాసనసభా స్థానాన్ని కేటాయించారు.

ముఠా గోపాల్ ఇలా...

ముఠా గోపాల్ ఇలా...

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ముఠా గోపాల్‌ను కెసిఆర్ పార్టీలో చేర్చుకుని హైదరాబాదులోని ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గం టికెట్ ఇచ్చారు.

నోముల నర్సింహయ్య ఇలా..

నోముల నర్సింహయ్య ఇలా..

నల్లగొండ జిల్లాకు చెందిన నోముల నర్సింహయ్య సిపిఎంలో ముఖ్య నాయకుడిగా ఉంటూ వచ్చారు. ఆయన సిపిఎంకు రాజీనామా చేసి, తెరాసలో చేరారు. ఇప్పుడు నాగార్జునసాగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయనున్నారు.

ప్రేమ్‌కుమార్ ధూల్ ఇలా...

ప్రేమ్‌కుమార్ ధూల్ ఇలా...

ప్రేమకుమార్ ధూల్ మంగళవారం తెరాసలో చేరారు. ఆయనకు కెసిఆర్ హైదరాబాదులోని గోషామహల్ టికెట్ కేటాయించారు. ఆయన ముఖేష్ గౌడ్‌పై పోటీ చేయనున్నారు.

రామ్మోహన్ గౌడ్ ఇలా...

రామ్మోహన్ గౌడ్ ఇలా...

రామ్మోహన్ గౌడ్‌ను కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించి హైదరాబాదులోని ఎల్బీ నగర్ సీటు ఇచ్చారు. ఆయన కాంగ్రెసు అభ్యర్థి సుధీర్ రెడ్డిపై పోటీ చేయనున్నారు.

English summary
Leaders including Nomula Narasimhaiah joined in K Chandrasekhar Rao's Telangana Rastra Samithi (TRS) and were allocated assembly seats. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X