పది గంటలు కెసిఆర్: కాగితాలు చూడకుండా (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై పది గంటల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుంచి ఏ విధంగా చేయాలో కచ్చితమైన సూచనలు చేశారు. తెలంగాణ వనరులు, వాస్తవాల ఆధారంగా ప్రణాళికలు ఉండాలన్నారు. ‘తెలంగాణ పునరావిష్కరణ' పేరిట ఆ సమాలోచన జరిగింది. తమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోటీ లేదని, గుజరాత్‌, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలతో పోటీ పడతామని కేసీఆర్‌ ఉద్ఘాటించారు.

విధానాలు పైనుంచి కింది స్థాయికి ప్రసరించడం తప్పు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. కింది స్థాయి నుంచే పైకి ప్రసరించాలని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం గ్రామ్‌స్థాయి నుంచి జరగాల్సి ఉందని, గ్రామస్థాయి ప్రణాళికలు మొదటగా రూపుదిద్దుకోవాల్సి ఉందని కెసిఆర్ చెప్పారు. అన్ని జిల్లాలకూ ఒకటే ప్రణాళిక పనికిరాదన్నారు.

తెలంగాణ పారిశ్రామిక విధానంలో కచ్చితంగా పెట్టుబడులకు ప్రోత్సాహం ఉంటుందని కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణలో పరిశ్రమలకు ఇవ్వడానికి ప్రస్తుతం 2.20 లక్షల ఎకరాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తన నియోజకవర్గం గజ్వేలులో 24వేల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 30 వేల ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు బయట.. 70 కిలోమీటర్ల అవతల ఎంత భారీ పరిశ్రమలు వచ్చినా ప్రభుత్వ భూమి కేటాయించే అవకాశం ఉందన్నారు.

బహిరంగ సభల్లో అరగంటే, కానీ..

బహిరంగ సభల్లో అరగంటే, కానీ..

కొన్ని లక్షల మంది హాజరయ్యే బహిరంగ సభలోనైనా కేసిఆర్ అరగంటకు మించి మాట్లాడరు. 15-20 నిమిషాల్లోనే ఉపన్యాసం ముగించిన సభలు కూడా ఉన్నాయి. కానీ, అధికారుల సమావేశంలో పది గంటలు మాట్లాడారు.

లంచ్ సమయానికి టీ బ్రేక్

లంచ్ సమయానికి టీ బ్రేక్

11గంటలకు ప్రారంభం అయిన సమావేశంలో మధ్యాహ్నాం రెండున్నర వరకు ప్రసంగించి, మనం టీ బ్రేక్ తీసుకుందాం అనగానే పక్కన ఉన్న వారు లంచ్ టైం అయిందని గుర్తు చేశారు. దానికి కేసిఆర్ నవ్వుతూ నేను ఎక్కువ సమయం తీసుకున్నానని అన్నారు.

కాగితాలు చూడకుండా లెక్కలు

కాగితాలు చూడకుండా లెక్కలు

తెలంగాణ కోసం ఏం చేయాలని నేను కోరుకుంటున్నానో మీకు అర్ధం అయి ఉంటుందని అన్నారు. అంకెల కోసం కాగితాలను చూడకుండా అన్ని అంశాలపై అనర్ఘళంగా ప్రసంగించారు.

శిక్షణ మాదిరిగా

శిక్షణ మాదిరిగా

ఇది ఉన్నతాధికారులకు తెలంగాణపై శిక్షణ కార్యక్రమంగా సాగింది. ముఖ్యమంత్రిగా కేసిఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఉన్నతాధికారులతో ఆయా శాఖల గురించి సమీక్షలు నిర్వహించడం తప్ప విస్తృతంగా సమావేశం నిర్వహించడం ఇదే మొదటి సారి.

అందరూ ఇలా..

అందరూ ఇలా..

ఐఎఎస్ అధికారులు, ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు, రెవెన్యూ డివిజన్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

గ్రామాలపై దృష్టి

గ్రామాలపై దృష్టి

ప్రతి జిల్లాకు సగటున వెయ్యి గ్రామాలు ఉండటంతో వెయ్యి మంది అధికారులను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ప్రణాళికల రూపకల్పనలో కలెక్టర్లకు సహకరించేందుకు ప్రతి జిల్లాకు ఒక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు.

వర్క్‌షాపులు ఇలా..

వర్క్‌షాపులు ఇలా..

ఆగస్టు ఒకటి నుంచి 10 వరకు రాష్టస్థ్రాయి ప్రణాళికపై వర్క్ షాపు నిర్వహించిన అనంతరం రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందిస్తామని అన్నారు. ఆగస్టు 19 నుంచి సర్పంచ్‌లకు, 23 నుంచి మండల అధ్యక్షులకు, 27 నుంచి జడ్పీడిటిసిలకు శిక్ష ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రజాప్రతనిధులకు శిక్షణ

ప్రజాప్రతనిధులకు శిక్షణ

వచ్చే శనివారం లేదా ఆదివారం ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

కెసిఆర్‌తో అనిల్ అంబానీ భేటీ

కెసిఆర్‌తో అనిల్ అంబానీ భేటీ

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ ధీరూబాయ్ అంబానీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+