శ్రీవారి భక్తులకు రాజమార్గం సిద్దం- తిరుపతికి ఇక రెండున్నార గంటల్లోనే..!!

తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్. తిరుపతికి వెళ్లేందుకు రాజమార్గం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా తిరుపతి ప్రయాణ సమయం తగ్గనుంది. దాదాపు రెండున్నార గంటల వరకు సమయం ఆదా కానుంది. సుదీర్ఘ కాలంగా ఈ మార్గంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అవి పూర్తి కావటంతో.. ఇక, ప్రయాణాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ రహదారి మీదుగా రాకపోక లు ప్రారంభం అయితే తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది. ఫలితంగా సమయం కూడా ఆదా కానుంది.

తిరుమలకు నిత్యం అనంతపురం, అన్నమయ్య, వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వీరితో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. తాజాగా మదనపల్లె నుంచి తిరుపతికి సునాయాసంగా రాకపోకలు సాగించేందుకు రాజమార్గం అందుబాటులోకి రానుంది. భారత మాల పరియోజన ప్రాజెక్ట్‌ కింద చేపట్టిన ఫస్ట్ ఫేజ్ పనులు మదనపల్లె నుంచి పీలేరు మీదుగా తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట వరకు పూర్తి చేసారు. దీంతో ఇక వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతిచ్చారు. అక్కడి నుంచి తిరుపతి సమీపంలోని చెర్లోపల్లె వరకు 20 కిలో మీటర్ల మేర అటవీ శాఖ అధికారులు అభ్యంతరంతో పనులు ఆగిపోయాయి.

Pileru - madana palli - Tirupati high way reduce travel time for Tirumala devotees

ఈ మార్గాన్ని భారత మాల పరియోజన కింద 1,852.12 కోట్ల రూపాయల నిధులతో జాతీయ రహదారి-71ను (NH71) చేపట్టారు. గతంలో ఈ రహదారి రెండు వరుసలుగా ఉండేది. ప్రస్తుతం 4 వరుసలుగా విస్తరించడంతో ప్రయాణ భద్రతతో పాటు ఇంధన పొదుపు, సమయం, దూరం ఆదా అవుతుంది. ఇప్పటి వరకు తిరుపతి నుంచి మదనపల్లె వెళ్లేందుకు దాదాపు 4 గంటల సమయం పడుతుండగా, ఇకపై 2.30 గంటల్లోనే చేరుకోవచ్చు.

ఇవి కూడా పూర్తైతే: మదనపల్లె నుంచి పీలేరు మధ్య 55.90 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 1,852 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మదనపల్లెకి సమీపంలో భూసేకరణ కారణంగా కొంత మేర పనులు ఆగిపోయాయి. ఇవి కూడా త్వరలోనే పూర్తి కానున్నాయి. తిరుపతి సమీపంలోని చెర్లోపల్లె నుంచి పీలేరు వరకు 38.17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి 357 కోట్ల రూపాయలతో 18.10 కిలోమీటర్ల రహదారి నిర్మించారు. అటవీ శాఖ అనుమతులు రానందున భాకరాపేట నుంచి కనుమ మీదుగా చెర్లోపల్లె వరకు 20 కిలో మీటర్ల రహదారి నిర్మాణం ఆగిపోయింది.

సీసీ కెమెరాలు, సర్వీస్‌ రోడ్లు: అప్రోచ్‌ రోడ్డులు, బ్రిడ్జిలు, గ్రామాలున్న చోట సర్వీసు రోడ్డు, క్రాస్‌ రోడ్ల వద్ద స్తంభాలు ఏర్పాటు చేసి లైటింగ్‌ సౌకర్యం కల్పించారు. మదనపల్లె- పీలేరు మధ్యన గండిబోయినపల్లె వద్ద టోల్‌ప్లాజాను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల రాకపోకలు సాగించేందుకు వీలుగా అవసరమైన చోట్ల అండర్‌ పాస్‌లు, రైల్వే లైన్ల వద్ద ఆర్వోబీల నిర్మాణం చేపట్టారు. పీలేరు, కలికిరి, వాల్మీకిపురానికి సమీపంలో ఈ రోడ్డు వెళుతుంది. దీంతో జాతీయ రహదారి నుంచి దిగి పైప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా సర్వీసు రోడ్లను నిర్మించారు.

రహదారిని అత్యాధునికంగా నిర్మించడంతో పాటు ప్రతి రెండు కిలోమీటర్లకు ఓ చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాహనాలపై నిఘా, ప్రమాదాలను గుర్తించేందుకు, ట్రాఫిక్‌ సమీక్షకు వీలుగా నేషనల్ హైవేపై ఇరువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వీటిని అనుసంధానిస్తూ టోల్‌ప్లాజా వద్ద కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్​ని ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+