ఆ దమ్ము.. జగన్ తరువాత మోదీకి మాత్రమే
YSRCP Siddham: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పర్యటనలను నిర్వహిస్తోన్నారు. జనంలోకి దూసుకెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.
ఒకదాన్ని మించి మరొకటి.. అన్న విధంగా సాగాయి ఈ సభలన్నీ కూడా. రాప్తాడులో ఏర్పాటు చేసిన సభ.. రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టుకు అద్దం పట్టింది. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. నాలుగు ఉమ్మడి రాయలసీమ జిల్లాల నుంచీ జనాన్ని తరలించడంలో పార్టీ నాయకులు విజయం సాధించారు.

280 ఎకరాల్లో ఈ సభను నిర్వహించినప్పటికీ.. స్థలం సరిపోలేదనే అంచనాలు ఉన్నాయి. సభా ప్రాంగణంలోనికి వెళ్లలేక రోడ్ల బయటే నిల్చుని వైఎస్ జగన్ ప్రసంగాన్ని విన్నారు. వారి కోసం ప్రత్యేకంగా సభా ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇతర రాయలసీమ జిల్లాలతో పోల్చుకుంటే టీడీపీకి గట్టి బలం ఉన్న అనంతపురంలోనే బహిరంగ సభ సక్సెస్ కావడం పార్టీ నాయకుల్లో జోష్ నింపింది.
ఈ సభపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధం సభకు సంబంధించిన ఓ యూట్యూబ్ లింక్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కరవు ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమలో ఒక్కసారిగా ఓ మహా సముద్రం ఉద్భవించినట్టయిందని వ్యాఖ్యానించారు.
సుమారు 10 లక్షల మందికి పైగా హాజరైన ఓ జన సముద్రంగా అభివర్ణించారు. ఓ రాజకీయ సభకు ఎప్పుడూ లేని విధంగా ఇన్ని లక్షలమంది హాజరు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారిగా రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. వైఎస్ జగన్ తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రమే ఈ స్థాయిలో ప్రజలను ఆకర్షించగలరని అన్నారు.












Click it and Unblock the Notifications