తిరుమలకు ప్రధాని మోడీ: స్వాగతం పలికిన సీఎం జగన్
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి ఏపీ ప్రధానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుని మోడీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపించారు. వారికి అభివాదం చేస్తూ మోడీ ముందుకు సాగారు.
అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి తిరుమలకు చేరుకున్నారు. రచన అతిథి గృహానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. ఆ తర్వాత రచన అతిథి గృహం వద్ద ప్రధానికి టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ప్రధాని మోడీ రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు.

సోమవారం ఉదయం 8 గంటల నుంచి 8.45 గంటల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనున్నారు. అనంతరం 9.30 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి నుంచి ప్రత్యేక విమనాంలో తెలంగాణలోని హకీంపేటకు చేరుకుంటున్నారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. హైదరాబాద్ నగరంలో ప్రధాని మోడీ రోడ్ షో కొనసాగనుంది. అంతేగాక, సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవానికి కూడా ప్రధాని మోడీ హాజరుకానున్నారు.
Prime Minister #NarendraModi participated in a Road Show in #Tirupati today, before he offer prayers at the #Tirumala temple in the early hours on Monday.#PMModi #AndhraPradesh#TelanganaAssemblyElections2023 pic.twitter.com/Ji2ZnE4Q0r
— Surya Reddy (@jsuryareddy) November 26, 2023
మోడీ రాకతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ప్రధాని మోడీ రాక సందర్భంగా తిరుమలలో అధికార యంత్రాంగం ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధాని మోడీ బస తదితర అంశాలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి అధికారులతో అంతకముందే సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఏపీ సీఎస్ ఆదేశించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే సమయంలో వీవీఐపీల పర్యటనల నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా టీటీడీ ఈవోకు కూడా తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications