Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Modi: రాజధానులూ కట్టలేదు, అప్పుల్లో ముంచేశారు-వైసీపీ సర్కార్ పై మోడీ ఫైర్..!

రాజమహేంద్రవరం వాసులకు నమస్కారం, గోదావరి తల్లికి ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగం ప్రారంభించారు. రాజమండ్రి కొత్త చరిత్ర రాసేందుకు సిద్దమవుతోందని మోడీ తెలిపారు. మే 13న మీ ఓటుతో ఏపీ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ రాబోతోందని మోడీ ధీమా వ్యక్తం చేసారు. ఇది వికసిత భారత్ లో కొత్త అడుగు అన్నారు. ఒడిశా నుంచి వస్తున్నానని, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రతీ చోటా ఎన్డీయే ప్రభుత్వాలు రాబోతున్నాయన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ లు ఉన్నాయని, కాంగ్రెస్ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిందని, వైసీపీని కూడా ఓటర్లు ఎన్నికలకు ముందే తిరస్కరించారన్నారు. వైసీపీకి ఐదేళ్ల కాలం దొరికిందని, దాన్ని వృథా చేసిందని, అభివృద్ధిలో వెనుకబడేలా చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో టాప్ లో ఉందని, కానీ వైసీపీ ఇక్కడ అభివృద్ధి రైలును పట్టాలు తప్పించిందన్నారు. ప్రజాహితానికి పని చేయడానికి బదులు ఏపీని అప్పులపాలు చేసిందన్నారు. కాబట్టి ఇక్కడ అభివృద్ధికి ఎన్డీయే మాత్రమే గ్యారంటీ ఇస్తోందన్నారు.

pm modi slams ysrcp government failure to built capital no development in rajahmundry rally

వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్టుల్ని ఆలస్యం చేయడం ద్వారా ప్రజలకు జరగాల్సిన ప్రయోజనం లేకుండా చేసిందన్నారు. కాంగ్రెస్ పైనా అప్రమత్తంగా ఉండాలన్నారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ దేశాన్ని పూర్తిగా పతనం చేసిందన్నారు. అప్పట్లో కాంగ్రెస్ అవినీతిపై దేశంలో ఎక్కువగా చర్చ జరిగేదన్నారు. కాంగ్రెస్ నేతలు, ఇండియా కూటమి వాళ్లు ఈడీ.. ఈడీ అని అరుస్తుంటారని, దీనికి కారణం జనం టీవీల్లో చూస్తున్నారన్నారు. జార్ఖండ్ లో ఈడీ నోట్ల కట్టల కొండను తవ్వితీసిందన్నారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ నేతలు తమ ఇంట్లో పనిమనిషి ఇళ్లను నోట్ల కట్టలతో నింపేశారన్నారు.

దేశం సంస్కరణలు, పనితీరు, మార్పువైపు పరుగులు తీస్తోందని మోడీ తెలిపారు. మీరు వేసే సరైన ఓటు వల్ల సమస్యల్ని అవకాశంగా మార్చుకోవచ్చని సూచించారు. భారత్ గురించి ప్రపంచం పాజిటివ్ గా ఆలోచిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు కాంగ్రెస్, వైసీపీ ప్రతికూల మనస్తత్వం నుంచి దూరంగా ఉండాలని, అభివృద్ధి అజెండాతో ఉన్న ఎన్డీయేతో కలవాలని మోడీ కోరారు.

మద్యం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. కానీ రాష్ట్ర ప్రభుత్వం మద్యం సిండికేట్లు నడిపిస్తోందన్నారు. ఏపీ ఇసుక, మద్యం మాఫియాలు నడుపుతోందని చెప్తున్నారు. అవినీతిలో ముందున్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిలో మాత్రం వెనుకబడిపోయిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీలో మూడు రాజధానులు చేస్తామని చెప్పిందని, కానీ ఐదేళ్లలో ఒక్క రాజధాని కూడా నిర్మించలేకపోయిందన్నారు. మూడు రాజధానులతో వైసీపీ దోచుకోవాలనుకుందని, కానీ నిధుల్లేక ఆగిపోయిందన్నారు. వైసీపీ కేవలం అవినీతిని మాత్రమే నిర్వహించగలరని, ఆర్ధిక వ్యవహారాలు నిర్వహించడం వీళ్ల వల్ల కాదన్నారు.

pm modi slams ysrcp government failure to built capital no development in rajahmundry rally

ప్రజలకు సేవచేయాలనే కోరిక లేని ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్పలితాలు వస్తాయని మోడీ తెలిపారు. ఏపీకి జీవనాడిగా భావించిన పోలవరాన్ని సైతం వైసీపీ పూర్తి చేయలేకపోయిందన్నారు. కేంద్రం 15 వేల కోట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేకపోయిందన్నారు. దీంతో ఏపీ రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరికి గిట్టుబాటు ధర కూడా లభించడం లేదన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఇలాంటి సమస్యల్ని పరిష్కరిస్తుందన్నారు.

గత పదేళ్లలో ఏపీని అభివృద్ధిలో తాము పరుగులు పెట్టించామని, అమరావతి-విజయవాడ రోడ్డు ప్రాజెక్టుతో పాటు ఏపీకి హైదరాబాద్ తో జోడించే దారుల్ని పూర్తి చేస్తున్నాం. విశాఖ-చెన్నై కారిడార్ వంటి ఎన్నో పనులు జరుగుతున్నాయన్నారు. చెన్నై-కోల్ కతా హైవే అయినా, రాజమండ్రి ఎయిర్ పోర్టు అయినా, విశాఖ రైల్వే జోన్ అయినా పూర్తయితే ఈ ప్రాంతం రూపు రేఖలు మారిపోతాయన్నారు. నేషనల్ హైవే పూర్తయితే ఫిషింగ్ హార్బర్, కాకినాడ పోర్టు వరకూ కనెక్టివిటీ పెరుగుతుందన్నారు.

ఏపీని ఎన్టీఆర్ గారితో గుర్తిస్తారని, ఆయన రాముడి చరిత్రను జనంలోకి తీసుకెళ్లారని, ఇప్పుడు బీజేపీ 500 ఏళ్ల కల అయిన భవ్య రామమందిరాన్ని పూర్తి చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రామమందిర ప్రతిష్టను బహిష్కరించిందని, ఆ మందిరానికి వెళ్తే నేతల్ని పార్టీలో నుంచి తొలగిస్తున్నారని మోడీ ఆరోపించారు. ఏపీ భవిష్యత్తు కోసం ఓటేయాలని మోడీ కోరారు. ఈసారి ఏపీ ప్రజల దగ్గర మోడీ గ్యారంటీతో పాటు చంద్రబాబు నాయకత్వం కూడా ఉందన్నారు. పవన్ నమ్మకం కూడా ఉందన్నారు. కాబట్టి పురంధేశ్వరి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉదయ్ శ్రీనివాస్, హరీష్ మాథుర్ ను భారీ మెజార్టీతో ఎంపీలుగా గెలిపించాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+