Ananthapur: జల సంకల్పానికి మోదీ సలాం
కరవుతో కుంగిపోయిన ప్రాంతాల్లో కూడా... ప్రజల సంకల్పం ఉంటే మార్పు సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కొరత సమస్యను తట్టుకుని నిలబడేందుకు చేపట్టిన స్వచ్ఛంద ప్రయత్నాలను ఆయన హృదయపూర్వకంగా ప్రశంసించారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్‌లో ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు.
వర్షపాతం తీవ్రంగా తగ్గిపోవడంతో అనంతపురం ప్రాంతంలో నీటి ఎద్దడి సాధారణ సమస్యగా మారిందని ప్రధాని గుర్తు చేశారు. అయితే, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అక్కడి ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి జలాశయాల పునరుద్ధరణకు నడుం బిగించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటివరకు పది కంటే ఎక్కువ చెరువులు, కుంటలు పునరుద్ధరించడంతో పాటు ఏడువేలకుపైగా మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు.

సీఎం ధన్యవాదాలు..
మన్ కీ బాత్ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రజలు చేపట్టిన జలసంరక్షణ చర్యలను ప్రస్తావించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం, ఈ ఏడాది తిరిగి ప్రారంభమైన తొలి మన్ కీ బాత్‌లో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను ప్రధాని ప్రస్తావించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు. కరవు ప్రాంతమైన అనంతపురంలో ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన జలవనరుల పునరుద్ధరణ చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు.
మరింత ప్రోత్సహిస్తుంది..
'స్వర్ణ ఆంధ్ర విజన్' కింద ప్రభుత్వం నిర్దేశించుకున్న పది కీలక సూత్రాల్లో నీటి భద్రత అత్యంత ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సాంప్రదాయ నీటి నిర్వహణ పద్ధతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తూ నీటి వనరులను సంరక్షిస్తున్నామని తెలిపారు. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం రాష్ట్రంలో అమలు చేస్తున్న నీటి భద్రతా మిషన్‌కు మరింత ఉత్సాహం, ప్రోత్సాహం అందిస్తోందని సీఎం తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Thank you, Hon’ble Prime Minister Sir, for highlighting the inspiring efforts of the people of Anantapur in water conservation during your first Mann Ki Baat of the year today. Water security is one of the Padi Sutralus adopted under our Swarna Andhra Vision. We are committed to… https://t.co/miBAjunoWi
— N Chandrababu Naidu (@ncbn) January 25, 2026
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications