హైఅలర్ట్, వైసీపీ, టీడీపీ లీడర్స్ ను పిలిచి పద్దతిగా చెప్పిన అధికారులు, తరువాత మీ ఇష్టం !
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత కొన్ని జిల్లాల్లో పరిస్థితులు అదుపుతప్పాయి. ఇప్పటికే పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అలర్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లోని సున్నితమైన అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అల్లర్లు జరిగే ప్రాంతాలను గుర్తించిన జిల్లా కలెక్టర్లు ఆ ప్రాంతంలోని పోలీసు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిఘా వేసిన పోలీసులు సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసుల బలగాలను మొహరించారు.

చూసిచూడనట్లు వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసు అధికారులు ఇప్పుడు అలర్ట్ అయ్యారు. వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరైనాసరే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులతో మాట్లాడిన పోలీసు అధికారులు ఈ విషయంపై పలు సూచనలు చేశారని వెలుగు చూసింది.
ఎన్నికలకు సంబంధించి గొడవలు చేసినా, ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేసినా, వారి ఆస్తులు నాశనం చెయ్యడానికి ప్రయత్నించినా చూస్తూ ఊరుకోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వైసీపీ, టీడీపీ నాయకులను పోలీసులు హెచ్చరించారని తెలిసింది. పోలింగ్ పూర్తి అయిపోయిన తరువాత పలు పట్టణాలు, గ్రామాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించడంతో ఇంకా కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిఘా వేశారు.












Click it and Unblock the Notifications