విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొరికిన లడ్డూ బ్రదర్స్: హత్య కేసులో నలుగురి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: గత నెల 20వ తేదీన పోలీసుల కళ్లు గప్పి పారిపోయిన దొంగలు లడ్డూ బ్రదర్స్‌ను పోలీసులు తిరిగి పట్టుకన్నారు. గురువారంనాడు విశాఖపట్నం జిల్లా పిఎం పాలెంలో జరిగిన మీడియా సమావేశంలో పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.

గత నెల 20వ తేదీన లడ్డూ బ్రదర్స్ ఎస్కార్ట్ పోలీసులు అనంతపురం నుంచి విజయవాడ తరలిస్తుండగా తప్పించుకున్నారు. వీరిద్దరూ తప్పించుకోవడంతో ఐదుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు కూడా. అయితే వీరిని గురువారంనాడు విశాఖలోని జగదాంబ సెంటర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

వారిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని విశాఖ పోలీసులు అనంతపురం పోలీసులకు తెలియజేశఆరు. వీరిపై తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. వీరు మూసి ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ లడ్డూ బ్రదర్స్‌గా పేరు మోశారు.

Police arrest Laddu brothers in Visakhapatnam

ఓ యువకుడి అనుమానాస్పద మృతి కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నగరంలోని పోలీసు కమిషనరేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో వారిని ప్రవేశపెట్టారు. గత నెల 9వ తేదీన మద్దివానిపాలెం గ్రామం సమీపంలో ఒక యువకుడు మృతి చెందగా పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు.

యువకుడిని హత్య చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ హత్య కేసులో బబ్లూ కుమార్, ఉమేష్, కిశోర్ కుమార్, అమిత్ అనే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. వీరిలో బబ్లూ కుమార్ అనే వ్యక్తికి ఒడిశాకు చెందిన క్రిమెంట్ ఎక్క రూ. 30 వేలు అప్పుగా ిచ్చారుడు.

డబ్బు తిరిగి ఇవ్వాలని క్రిమెంట్ బబ్లూపై ఒత్తిడి పెంచాడు. దీంతో మిగిలి ముగ్గురు స్నేహితుల సాయంతో క్రిమెంట్ ఎక్కను అడ్డు తొలగించుకోవడానికి హత్య చేశాడని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని బబ్లూ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

English summary
Visakhapatnam police nabbed laddu brothers at Jagadamba centre, Laddu Brother escaped from the police last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X