నవ్వుతూ కోర్టు నుండి బయటకు జయసుధ (పిక్చర్స్)

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి నేతలకు ఇబ్బందికరంగా మారింది. రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి రావాల్సి ఉండగా.. ఎన్నికల నియమావళి నేపథ్యంలో ఆయన సోదరుడు నాగబాబు హాజరయ్యారు.

ప్రముఖ నటి, సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు జయసుధ సోమవారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో సికింద్రాబాద్ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. 2009 ఏప్రిల్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగంపై విచారణ నిమిత్తం సోమవారం కోర్టుకు జయసుధ వచ్చారు. నామాల గుండు ప్రాంతంలో అనుమతి తీసుకోకుండానే పోలింగ్ సామాగ్రిని, పార్టీ జెండాలను కార్యకర్తలకు పంపిణీ చేసినట్లు అప్పటి ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా సోమవారం న్యాయవాదులతో కలిసి జయసుధ కోర్టుకు వచ్చారు. కేసు జూన్ తొలి వారానికి వాయిదా పడింది.

కాగా, రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల మధ్య వంద మీటర్లదూరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం సూచించారు.

నవ్వుతూ కోర్టు నుండి బయటకు జయసుధ

నవ్వుతూ కోర్టు నుండి బయటకు జయసుధ

ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ పరిధిలో డివిజన్లలో ఆయా పార్టీల కార్యాలయాలు ప్రారంభిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిటీ పోలీస్ చట్టం 1348 సెక్షన్ 21(జి), 22(డి) ప్రకారం కనీస దూరం ఉండాలన్నారు.

నవ్వుతూ కోర్టు నుండి బయటకు జయసుధ

నవ్వుతూ కోర్టు నుండి బయటకు జయసుధ

హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేయబోయే వారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

నవ్వుతూ కోర్టు నుండి బయటకు జయసుధ

నవ్వుతూ కోర్టు నుండి బయటకు జయసుధ

అనుమతులు ఉంటేనే ఎన్నికల ప్రవర్తన నియమావళి మొదలైన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధుల్లో బహిరంగ సభలు, పాదయాత్రలు, ర్యాలీలు, మొబైల్ ప్రచారం నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని పోలీసు శాఖ స్పష్టం చేసింది.

నవ్వుతూ కోర్టు నుండి బయటకు జయసుధ

నవ్వుతూ కోర్టు నుండి బయటకు జయసుధ

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ హెచ్చరించారు. గాంధీ నగర్ పోలీసు ఠాణా పరిధిలో ఆదివారం అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన ఓ రాజకీయ పార్టీ నేతలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+