పేర్నికి బిగుస్తున్న ఉచ్చు - అజ్ఞాతంలోకి..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి అయింది. అటు జమిలి దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పై పోరుబాట మొదలు పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పేర్ని నాని కుటుంబం పైన కేసు నమోదు అయింది. అరెస్ట్ తప్పదనే వాదన వినిపిస్తోంది. దీంతో, అజ్ఞాతంలోకి పేర్ని కుటుంబం వెళ్లింది.
వైసీసీ సీనియర్ నేత పేర్ని నాని సతీమణి జయసుధ పై సొంత గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసు నమోదైంది. పేర్ని నాని తన సతీమణి పేరుతో పౌరసరఫరాల సంస్థకు అద్దెకు ఇచ్చిన గోదాములో అందులో నిల్వ ఉంచిన 3 వేల 708 బస్తాల మేర రేషన్ బియ్యం మాయమయ్యాయి.
దీని పైన పోలీసులు కేసు నమోదు చేసారు. సివిల్ సప్లయిస్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిష న్‌లో అభ్యర్థించారు. ఈ కేసు నమోదైన సమయం నుంచి పేర్ని నాని కుటుంబంతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుని హోదాలో పేర్ని నాని నేతృత్వం వహించాల్సి ఉంది. కానీ, నానితో పాటుగా ఆయన కుమారుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పేర్ని కుటుంబానికి చెందిన గోడౌన్ లో మాయమైన 185 టన్నుల బియ్యం వ్యవహారంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదైనా పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో నిందితులను అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications