మూడు రాజధానులకు మద్దతుగా... పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా...

అమరావతిలో రాజధాని పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలవంతంగా భూములు లాక్కొన్నందుకు నిరసనగా... ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మరో పదేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగాన్ని వదులుకున్నారు.

మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన బసవరాజ్ అనే ఆ కానిస్టేబుల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉన్న హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. గురువారం(సెప్టెంబర్ 3) ప్రెస్ మీట్ నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. అమరావతి పేరుతో గత ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా లాక్కొందని ఆరోపించారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం అన్ని ప్రాంతాల అభివృద్దికి దోహదపడుతుందన్నారు. జగన్ నిర్ణయానికి తన మద్దతు ప్రకటించారు.

police constable resign to job in support of three capitals in andhra pradesh

Recommended Video

    YSR Vardhanthi : ఇడుపులపాయ లో వైయస్సార్ కుటుంబం, ప్రత్యేక ప్రార్థనలు | #YSRForever | Oneindia Telugu

    కాగా,రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమ అభివృద్ది కోసం వైసీపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి,జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు,ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం ఉండనున్నాయి. అయితే ప్రతిపక్ష టీడీపీతో పాటు రాజధాని రైతులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు విచారణలో ఉంది. హైకోర్టు తీర్పు వచ్చేంతవరకు యదాతథ స్థితి కొనసాగనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+