కడప ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే ?

కడప జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసు నిందితుడు ప్రేమోన్మాది వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. శనివారం ( 11-4-2026 ) తెల్లవారుజామున నిందితుడు పోలీసుల అదుపు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం గాయపడిన వెంకటేశ్‌ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగిందంటే..

పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను మైదుకూరు నుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా, అతడు ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడు. పారిపోతున్న వెంకటేశ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు తొలుత గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే నిందితుడు పోలీసులపై ఎదురుతిరగడంతో, అతడి కాళ్లపై కాల్పులు జరపాల్సి వచ్చిందని సమాచారం.

police-firing-on-kadapa-minor-girl-murder-accused-while-trying-to-escape-from-police-custody

ఖాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, నాగ మునెమ్మల 17 ఏళ్ల కుమార్తె ఇటీవల ఇంటర్‌ పూర్తి చేసింది. అదే మండలంలోని ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి చేయగా, ఆ యువతి నిరాకరిస్తూ వచ్చింది. దీంతో వెంకటేశ్‌ యువతిపై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదను చూసి బాలిక ఇంటికి వచ్చిన అతడు, మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి గొంతు కోసి వెంకటేశ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను తండ్రి శ్రీనివాసులు, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో చెన్నూరు వద్ద కడప రిమ్స్‌కు తీసుకెళ్లేలోపు ఆమె ప్రాణాలు విడిచింది. చనిపోవడానికి ముందు యువతి తన తండ్రితో వెంకటేశ్‌, ప్రవీణ్‌ పేర్లను ప్రస్తావించింది. మిగతా వివరాలు చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, మాట్లాడలేకపోయింది. దీంతో యువతి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కడప జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇప్పటికే ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి దాడులను ఎట్టి పరిస్ధితుల్లోనూ క్షమించలేమన్నారు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైందని, చట్టవ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+