Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Guntur GGH: 12 గంటల్లోనే కిడ్నాపైన శిశువును తల్లి ఒడికి చేర్చిన పోలీసులు..

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం ఓ మహిళ కిడ్నాప్‌కు గురైన ఎనిమిది రోజుల పసికందును గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులోని సుబ్బయ్య కాలనీకి చెందిన రోషిణి డెలవరీ కోసం సెప్టెంబర్ 26న గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చారు. రోషిణి సెప్టెంబర్ 31న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాతి రోజు ఆమెను 106వ వార్డుకు తరలించారు. బాలింతలు ఎక్కువగా ఉండడంతో ఒక్కో బెడ్ పై ఇద్దరిని పడుకోబెట్టారు.

రోషిణితో పాటు ఆమె అత్త కూడా ఉంది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు శిశువుకు పాలు పట్టించారు. ఆ తర్వాతు శిశువు నిద్రపోగా.. తల్లి, నానమ్మ కూడా నిద్రకు ఉపక్రమించారు. సాయంత్రం 4 గంటలకు రోషిణి నిద్ర లేచి చూసేసారికి తన బిడ్డ కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు.

Police handed over the kidnapped baby to her parents at Guntur GGH Hospital

ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఓ మహిళ శిశువును ఎత్తుకెళ్తున్నట్లు దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. వెంటనే ఆమె సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు 12 గంటల్లోనే పోలీసులు పసికందును రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.మంగళవారం పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఉప్పలపాడుకు చెందిన నిందితులు కంబాల లక్ష్మి(38) మధ్యాహ్నం తల్లీకూతుళ్లు నిద్రిస్తుండగా.. పసికందును అపహరించి ఆటోరిక్షాలో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.

నిందితులు గుంటూరు బస్టాండ్‌కు వెళ్లి బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితురాలి ఇంట్లో పసికందును పోలీసులు గుర్తించారు. ఆస్పత్రిలోకి రోగుల సహాయకులుగా కొంత మంది వచ్చి ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ చెప్పారు. రోజూ ఆసుపత్రికి సుమారు 3 వేల మందికి పైగా ఓపీ, 1600 మందికి పైగా ఇన్‌ పేషంట్లు వస్తారని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+