సజ్జల ఉక్కిరి బిక్కిరి - తాడేపల్లిలో కీలక పరిణామం..!!

వైసీపీ ముఖ్య నేత సజ్జల చిక్కుల్లో పడ్డారు. వైసీపీ హయాంలో జగన్ తరవాత కీలక అంశాల్లో అన్నీ తానై వ్యవహరించిన సజ్జలను ఇప్పుడు కేసులు చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే కీలక కేసుల్లో సజ్జల ప్రమేయం పైన ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసారు. కాగా, తాజాగా మరో కేసులో రేపు (గురువారం) విచారణకు రావలంటూ మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

సజ్జలకు పోలీసుల నోటీసులు
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రేపు విచారణకు రావాలని సూచించారు. రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారణ చేసారు. ఈ దాడి వెనుక వైసీపీ ముఖ్య నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు పొందారు.

Police issues notices for Sajjala in TDP office Attack case details here

రేపు విచారణ కోసం
అయితే, ఈ కేసులో విచారణ మాత్రం కొనసాగుతోంది. అందులో భాగంగా ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న వైసీపీ యువజన నేత చైతన్య తాజాగా లొంగిపోయారు. అదే విధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సైతం పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాగా, ఇప్పుడు సజ్జలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సజ్జలపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఢిల్లీ ఏయిర్ పోర్టులో సజ్జలకు లుకౌట్ నోటీసుల అంశం పైన వివాదం చోటు చేసుకుంది.

లుకౌట్ నోటీసుల తరువాత
విదేశాల నుంచి తిరిగి వస్తున్న సజ్జలను మంగళవారం ఢిల్లీ ఎయిర్‌ పోర్టు పోలీసులు అడ్డుకోవడంతో తొలిసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఇటీవల ఆయనను ఆ కేసులో నిందితునిగా చేరుస్తూ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఆ కేసులో నిందితులందరికీ పోలీసులు ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. సజ్జలకు నోటీసుల అంశాన్ని డీజీపీ నిర్దారించారు. కాగా, ఇప్పుడు టీడీప కార్యాలయం పై కేసులో నోటీసులు ఇవ్వటంతో సజ్జల హాజరు పైన సస్పెన్స్ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+