మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనట...భారీ దాడికి పోలీసుల ప్రణాళిక: త్వరలో!
అమరావతి:మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకునేందుకు పోలీస్ శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. నక్సల్స్ చేతిలో అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యల తరువాత వారిపై అతి భారీ దాడికి పోలీసులు సమాయత్తమవుతున్నారని తెలిసింది.
మావోయిస్టుల లివిటిపుట్టు దాడికి ప్రతి దాడి కోసం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఏపీ పోలీసులు...ఈ క్రమంలో ఒడిషా, ఛత్తీస్ ఘఢ్ పోలీసులతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలతో సమన్వయం చేసుకుంటున్నారు. ఇటీవలే భువనేశ్వర్ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలకు అనుగుణంగా ఆయా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే బెడవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అనంతరం శాంతిభద్రతలపై డిజిపితో సమీక్షించారు.

గవర్నర్...సమీక్ష
విజయవాడ బ్రహ్మోత్సవాల్లో భాగంగా విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వచ్చిన గవర్నర్ నరసింహన్ మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎపి డిజిపి ఆర్పీ ఠాకూర్ తో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలసి రాష్ట్రంలో శాంతి భద్రతలు, మావోయిస్టుల దాడిని సమీక్షించారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల ఏడీజీ హరీశ్ కుమార్ గుప్తా, ఐజీ రవిశంకర్ అయ్యన్నార్ తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన నాలుగేళ్లలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన పోరు వివరాలను గవర్నర్‌కు డీజీపీ ఠాకూర్ వివరించారు.

మావోయిస్టుల...పరిస్థితి ఇది
డిజిపి ఠాకూర్ గవర్నర్ కు పరిస్థితి వివరిస్తూ...ఏపీ పోలీసులు ఎక్కడా వెనకడుగు వేయలేదని...నాలుగేళ్లలో 40 మంది మావోయిస్టులను మట్టుబెట్టి, 255 మందిని అరెస్టు చేశామని...రాష్ట్ర విభజన తర్వాత 320 మంది లొంగిపోయారని...వారి నుంచి 96ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని...వివరించారని సమాచారం. అలాగే
రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో ఎపిలో మావోయిస్టులు చేసిన ఆస్తినష్టం రూ.12.24 కోట్లుగా ఉన్నా...ఆ తర్వాత వారిని బాగా కట్టడి చేశామని ఠాకూర్ తెలిపారట. 2015 నుంచి తీసుకున్న పటిష్టమైన చర్యల వల్ల 2016లో కేవలం రూ.5 వేల విలువైన ఆస్తి మాత్రమే వారు ధ్వంసం చేయగలిగారని పోలీసు బాస్ వివరించారట.

ఐపిఎస్ ల...బదిలీలు
అనంతరం డిజిపి మీడియాతో పాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు ఎప్పుడైనా ఉండొచ్చని తెలిపారు. ఒకటి రెండు జిల్లాల ఎస్పీల బదిలీ అనివార్యమని, మరో మూడు జిల్లాల ఎస్పీలను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బదిలీ చేయాల్సి ఉందని వెల్లడించారు. మీడియాలో వస్తోన్న విధంగా నేను ప్రతిరోజూ బదిలీలపై చర్చ కోసం సీఎం దగ్గరికి వెళ్లడం లేదని...అయినా ప్రతి ఉదయం సీఎంతో సీఎస్, డీజీపీ సమావేశం సాధారణంగా ఉండేదేనని ఆయన వివరించారు.

రైట్ పర్సన్‌కు...రైట్ ప్లేస్
మీడియాలో వస్తోన్న విధంగా పైరవీల ఆధారంగా జిల్లా ఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వబోరని, శాంతి భద్రతల నిర్వహణే ధ్యేయంగా ‘రైట్ పర్సన్‌కు రైట్ ప్లేస్' ఉంటుందని ఈ సందర్భంగా డిజిపి ఠాకూర్ తేల్చిచెప్పేశారు. ఆదివారం విజయవాడలో నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణకు రావాల్సిందిగా సీఎంని ఆహ్వానించగా ఆయన అంగీకరించిన విషయాన్ని తెలిపారు. మావోయిస్టుల మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని, గిరిజనులకు మద్దతు అంటూనే అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యేని హత్య చేయడం తప్పు కాదా?' అని డీజీపీ ఈ సందర్భంగా ప్రశ్నించడం గమనార్హం.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications