ప్రకాశం బ్యారేజ్ బోట్ల కేసు, స్కెచ్ వేసింది కుక్కలగడ్డ ఉషాద్రి ?, వైసీపీ లీడర్ కాల్ డేటా లో ?

ప్రకాశం బ్యారేజ్ ను ఐదు బోట్లు డీకొట్టిన ఘటన కేసు రసవత్తరంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు డీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ కేసులో ఇద్దరు వైసీపీ మద్దతుదారులను పోలీసులు అధికారికంగా అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ద్వంసం చెయ్యడానికి వైసీపీ మద్దతుదారులే ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో విజయవాడ ప్రజలు ఉలిక్కిపడ్డారు.

ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన తలశిల రఘురాంకు సమీప బంధువు అయిన కొమటి రామ్మోహన్, అతని ముఖ్య అనుచరుడు ఉషాద్రిని సోమవారం ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుల రామ్మోహన్, ఉషాద్రిల ఫోన్ కాల్ డేటా, గూగుల్ టేక్ అవుట్ వివరాలను విజయవాడ పోలీసులు సేకరించారు. రామ్మోహన్, ఉషాద్రి కాల్ డేటా వివరాలను పోలీసులు సేకరించారని తెలిసింది.

Police produced YCP supporters before the court in the Prakasam Barrage Gates case

ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొట్టిన బోట్లలో మూడు బోట్లు ఉషాద్రివి అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. వైసీసీ నాయకకుడు రామ్మోహన్ కు ఉషాద్రి చాలా సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని పోలీసులు దర్యాప్తులో తేలిపోయింది. వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుతం జైల్లో ఉన్న నందిగం సురేష్ కు కూడా ఈ బోట్ల యజమాని ఉషాద్రి చాలా సన్నిహితుడు అని విజయవాడ పోలీసులు అంటున్నారు.

ఉషాద్రికి చెందిన మూడు బోట్లకు వైసీపీ జెండా రంగులు ఉండటంతో ఆ పార్టీ నాయకులకు కూడా కుట్ర కోణంలో సంబందం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కుక్కలగడ్డ.ఉషాద్రి మూడు బోట్లను నిర్లక్షంగా వదిలేయడం వలనే ప్రకాశం బ్యారేజ్ లోకి కొట్టుకుని వెళ్లాయని పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసింది. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి ఈ కేసుకు సంబంధించి వైసీపీ నాయకుల ప్రమేయం ఉందా ? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద ప్రకాశం బ్యారేజ్ బోట్ల కేసులో వైసీపీ మద్దతుదారులు అధికారికంగా అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+