మసాజ్ సెంటర్‌పై దాడి: మహిళలు సహా ఐదుగురి అరెస్ట్

సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం సదరు మసాజ్ సెంటర్ పైన దాడి చేశారు. అనంతరం వారిని ఉప్పల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుసుకొని దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
భారీ చోరీ
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దొంగతనం జరిగింది. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద మృతి
కడప జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పత మృతి చెందాడు. జిల్లాలోని అక్కాయపల్లెకు చెందిన వెంకట సుబ్బయ్య మరో వ్యక్తికి డబ్బు బాకీ ఉన్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి సుబ్బారాయుడు, ఆయన కొడుకు పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తండ్రీ కొడుకులను పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.
రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తండ్రీ కొడుకులను విచారించారు. ఈ సమయంలో సుబ్బారాయుడు కుప్పకూలిపోయాడు. ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్తే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. పోలీసులు కొట్టడంతోనే తన తండ్రి మృతి చెందాడని కొడుకు ఆరోపిస్తున్నాడు.












Click it and Unblock the Notifications