'లావణ్య కేసులో రాజకీయ ఒత్తిళ్లు లేవు': మృతికి కారణం ఇదీ!
విశాఖ: ఏపీలోని విశాఖలో దాదాపు పది రోజుల క్రితం లావణ్య అనే మహిళ మృతి చెందారు. నలుగురు యువకులు కారుతో ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టడం వల్ల మృతి చెందారు. ఈ కేసు విషయమై పోలీసులు సోమవారం నాడు స్పందించారు.
లావణ్య మృతి కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు సేకరిస్తున్నట్లు విశాఖ నగర పోలీసు కమిషనర్ యోగానంద్ ఈ రోజు తెలిపారు. ఈ కేసులో నిష్ఫక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దర్యాఫ్తు విషయంలో పోలీసులపై ఒత్తిడి లేదన్నారు.
ఈ కేసులో నిందితులను తప్పించేందుకు రాజకీయ నేతలు ఒత్తిళ్లు వస్తున్నాయన్న మీడియా వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించవలసి ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

అనకాపల్లికి చెందిన హేమంత్ కుమార్, అతని స్నేహితులు లావణ్య దంపతులను వేధించారని, వారికి హానీ తలపెట్టాలనే ఉద్దేశ్యంతో కారుతో ఢీకొట్టారని మీడియాలో వచ్చిన వార్తలు కూడా అవాస్తవమని చెప్పారు.
తాగిన మైకంలో హేమంత్ కుమార్ తన కారుతో లావణ్య ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టారన్నారు. హేమంత్ కుమార్ తాగిన మైకంలో ఉండటంతో పాటు ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్నాడని, అందుకే ప్రమాదం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. దర్యాఫ్తు ఇంకా కొనసాగుతోందని, నిష్పక్షపాతంగా దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications