ఐదుగురి అరెస్టు: ఐదు కోట్ల శంఖం స్వాధీనం (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాదులోని బొల్లారంలో విలువైన శంఖాన్ని టాస్క్‌పోర్సు పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్టుచేశారు. శుక్రవారం సాయంత్రం బొల్లారం పరిసర ప్రాంతాల్లో ఈ వార్త సంచలనం రేపింది.

ఐదుగురు దొంగల ముఠా విలువైన శంఖాన్ని అపహరించి విక్రయించటానికి ప్రయత్నిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీనితో వారు వలపన్ని నిందితులకు నేరుగా ఫోన్‌చేసి కొనుగోలుదారులుగా నటించి బొల్లారం రావాల్సిందిగా కోరారు.
దీంతో బిహెచ్‌ఇఎల్ చెందిన నిందితులు హరికృష్ణ, సాయికృష్ణ, మనోహర్, హకీంపేట వద్ద ఉన్న దేవరయాంజాల్‌కు చెందిన అబిద్, శ్రీధర్ రెడ్డి బొల్లారానికి వచ్చారు. పథకం ప్రకారం వారి నుండి శంఖం స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల నుండి లభించిన విలువైన శంఖం ఖరీదు 5 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications