జగన్ Vs చంద్రబాబు, "గోదావరి"లో ఎవరికెన్ని సీట్లు - తాజా సర్వే రిపోర్ట్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. సీఎం జగన్ వర్సస్ చంద్రబాబు, పవన్ అన్నట్లుగా ఎన్నికల సమరం సాగుతోంది. అధికారం నిలబెట్టుకోవటం కోసం జగన్ అనూహ్య మార్పులు..నిర్ణయాలు చేస్తున్నారు. టీడీపీకి ఈ ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారాయి. ఏపీలో అధికారం దక్కాలంటే గోదావరి జిల్లాల్లో దక్కించుకొనే సీట్లు కీలకం. ఇక్కడ పవన్ ఏ మేర ప్రభావం చూపిస్తారనేది ప్రధాన అంశం. ఈ సమయంలోనే గోదావరిలో బలాబలాలపై అంచనాలు వెల్లడించింది.

హోరా హోరీ పోరు: ఏపీలో ఈ సారి ఎన్నికల సమరం హోరా హోరీగా కనిపిస్తోంది. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ధీమాగా ఎన్నికల్లోకి దిగుతున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో బరిలో నిలుస్తున్నాయి. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. సంక్షేమం ప్రధాన అజెండాగా మారుతోంది. సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించటం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ప్రారంభించింది.

Political Critic Survey predicts neck to neck fight in Godavari districts between YSRCP and TDP, Janasena

టీడీపీ - జనసేన సీట్లు సర్దుబాటు కొలిక్కి రాలేదు. ఇక..ఎవరు అధికారంలోకి రావాలన్నా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సీట్లు కీలకం కానున్నాయి. అక్కడ పవన్ పైన చంద్రబాబు భారీ ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాలతో జగన్ కౌంట్ గేమ్ బిగిన్ చేసారు. దీంతో..ఆ రెండు జిల్లాల్లో ఎవరి ప్రభావం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది.

పవన్ ప్రభావం ఎంత: ఉభయ గోదావరి జిల్లాల్లో 2014లో టీడీపీ పశ్చిమ గోదావరి లో క్లీన్ స్వీప్, తూర్పులో 5 స్థానాలు మినహా మిగిలనవి గెలిచి అధికారం దక్కించుకుంది. 2019 లో జగన్ ఈ రెండు జిల్లాల్లో 6 స్థానాలు మాత్రమే కోల్పోయి అధికారంలోకి వచ్చారు. ఈ సారి జగన్ కు ఇక్కడ గట్టి పరీక్ష తప్పేలా లేదు. టీడీపీ - జనసేన పొత్తుతో లెక్కలు మారుతున్నాయి.

Political Critic Survey predicts neck to neck fight in Godavari districts between YSRCP and TDP, Janasena

రెండు జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి. ఇక్కడి పరిస్థితులపై తాజా నివేదికలతో జగన్ అభ్యర్దుల మార్పు ప్రారంభించారు. తాజాగా పొలిటికల్ క్రిటిక్ సర్వే ఈ జిల్లాలో అంచనాలను వెల్లడించింది. ఇక్కడ ఏడు స్థానాల్లో ప్రజాభిప్రాయం ఏంటో విశ్లేషించింది. అందులో హోరా హోరీ పోరు తప్పదనే సంకేతాలు స్పష్టం అవుతున్నాయి. రాజోలు లో వైసీపీ - టీడీపీ, జనసేన మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని..అదే సమయంలో టీడీపీకి కొంత సానుకూలత ఉంటుందని వెల్లడించింది.

అధికారం డిసైడ్ అయ్యేది ఇక్కడే: మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురంలో వైసీపీ కంటే టీడీపీ వైపు ఆదరణ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పీ గన్నవరంలో హోరా హోరీ పోరు ఉన్నా..వైసీపీకి అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కొత్తపేటలో వైసీపీ- టీడీపీ, జనసేన మధ్య గట్టి పోటీ ఉంటుందని..వైసీపీకి అనుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. మండపేటలొ టీడీపీ విజయం సాధిస్తుందని అంచనా గా స్పష్టం చేసింది.

ముమ్మడివరంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉన్నా వైసీపీకే అవకాశం ఉందని పేర్కొంది. రామచంద్రాపురంలోనూ హోరా హోరా పోరు తప్పదని..వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని విశ్లేషించింది. దీంతో..వైసీపీ- టీడీపీ, జనసేన ధీమగా చెబుతున్నట్లుగా ఫలితం ఏకపక్షం కాదని..హోరా హోరీ తప్పదని స్పష్టం అవుతోంది. దీంతో..ఎన్నికల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+