సంక్రాంత్రి సెలవులు జనవరి 12 నుంచి...విద్యాశాఖ ఉత్తర్వులు
అమరావతి: ఎపిలో అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. పొంగల్ హాలిడేస్ జనవరి 12 నుంచి 20 వరకు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని అన్నిరకాల యాజమాన్యాల పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తేదీలను ప్రకటిస్తూ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ ఇన్‌చార్జ్ కమిషనర్ శ్రీనివాస్ అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు జారీ చేశారు. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2018 జనవరి 11నుంచి 20వరకు సెలవులు ఉన్నప్పటికీ జన్మభూమి కార్యక్రమం వల్ల పాఠశాలల సెలవుల్లో మార్పు చేశారు. దీంతో జనవరి 12వ తేది నుంచి సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఆర్.సి 473 జారీచేసింది. జనవరి 21న ఆదివారం కావడంతో తిరిగి 22న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. దీంతో 8 రోజులు పండుగు సెలవులు, రెండు ఆదివారాలు కలసి మొత్తం 10 రోజులు పాఠశాలలకు సెలవులు వచ్చాయి.

బకాయిలు చెల్లించండి...
రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు పదో వేతన సవరణ ప్రకారం చెల్లించాల్సిన పదకొండు నెలల బకాయిలను, రెండు విడతల కరువుభత్యంను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం డిమాండ్ చేశారు. పదో పీఆర్సీ అమలుచేసి మూడేళ్లు గడిచినా పెండింగ్‌లో ఉన్న ఆర్ధిక బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని, అలాగే సంవత్సరకాలంగా రెండు విడతల డిఏ కూడా ప్రభుత్వం మంజూరు చెయ్యకపోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications