కెసిఆర్‌కు పొంగులేటి కృతజ్ఞతలు: ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తుమ్మల నాగేశ్వర్‌రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి కేటాయించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఖమ్మం జిల్లా సమస్యలను తీర్చడంలో తుమ్మలపై మరింత బాధ్యత పెరిగిందని పొంగులేటి సుధాకర్ రెడ్డి న్నారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో తుమ్మల నాగేశ్వర్‌రావు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తుమ్మల
మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో.. అందరూ తెల్ల చొక్కాలు వేసుకురాగా.. తుమ్మల నాగేశ్వరరావు మాత్రం గులాబీ రంగు చొక్కా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలించారు. తెలుపు గులాబీల మధ్య పింకు గులాబీ తళుక్కున మెరిసిపోయినట్లు ఫోటో సెషన్ కార్యక్రమంలో తుమ్మల మెరిసిపోయారు. గులాబీ రంగు షర్ట్ ధరించి అందరి కంటే భిన్నంగా కనిపించారు. సిఎం కేసీఆర్‌తో సహా మిగతా మంత్రులు తెల్ల షర్ట్‌లు ధరించారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ కాలం పని చేశారు. తెలుగుదేశం పార్టీని వీడిన ఆయన ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే.
ఖమ్మం జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించారు. దీంతో ఆయన మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. అంతకుముందు తుమ్మల మాట్లాడుతూ.. కెసిఆర్ కల బంగారు తెలంగాణ సాధన కోసం తాను శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications