Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ అమ్మాయికి కడుపు చేసి మోసం-అదొక్కటి చేస్తే నీకు గుడి కడుతా-పవన్ కల్యాణ్‌కు పోసాని సంచలన సవాల్

'రిపబ్లిక్' సినిమా ఈవెంట్‌లో సీఎం జగన్,వైసీపీ మంత్రులను టార్గెట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి రీసౌండ్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు పవన్ కల్యాణ్‌ను చెడామడా వాయించేలా వ్యాఖ్యలు చేయగా... తాజాగా ప్రముఖ నటుడు,సినీ రచయిత పోసాని కృష్ణమురళి తెరపైకి వచ్చారు. ఊహించని రీతిలో పవన్ కల్యాణ్‌కు ఓ సంచలన సవాల్ విసిరారు. సీఎం జగన్‌తో పోల్చుకునే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదన్న పోసాని... ఒక్క పని చేస్తే మాత్రం ఆయన అందరికంటే గొప్పోడని ఒప్పుకుంటానన్నారు. పవన్‌కు ఏకంగా గుడి కట్టేస్తానన్నారు. పవన్ కల్యాణ్ అంటే ఏంటో ప్రజలకు తెలుసునని... అందుకే ఎక్కడ కాల్చాలో అక్కడ కాల్చారని ఎద్దేవా చేశారు. ఇంతకీ పోసాని పవన్‌కు విసిరిన ఆ సంచలన సవాల్ ఏంటంటే...

'ఆ అమ్మాయికి కడుపు చేసి.. అబార్షన్ చేయించుకోమని వార్నింగ్'

'ఆ అమ్మాయికి కడుపు చేసి.. అబార్షన్ చేయించుకోమని వార్నింగ్'

'గత ఎన్నికల్లో మీరు రెండు నియోజకవర్గాల్లో నిలబడ్డారు... ఒక నియోజకవర్గంలోనైనా గెలిచారా..నిజంగా ప్రభుత్వం అన్యాయాలు,అక్రమాలు చేస్తే కేసులు పెడుదాం,సీబీఐకి అప్పగిద్దాం... కానీ ఈలోగా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది.అది మీరు పరిష్కరించగలరు.మీరు హీరో,మానవతావాది,ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తా,తాట తీస్తా అని గతంలో చెప్పారు. అంటే,ఆడవాళ్లపై మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. ఒక పంజాబ్ అమ్మాయి 16 ఏళ్ల వయసులో తెలుగు పరిశ్రమకు ఎన్నో కలలతో వచ్చింది. ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు నిన్ను పైకి తీసుకొస్తా అంటే నమ్మింది.అతను ఆమెకు కడుపు చేసి మోసం చేశాడు.ఇదేంటని ప్రశ్నిస్తే... నోరు మూసుకో,అబార్షన్ చేయించుకో... బయటపెట్టావో కనబడకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడట.ఇది నేను విన్నాను.. మీకు చెబుతున్నాను.' అని పోసాన్ కృష్ణమురళి చెప్పుకొచ్చారు.

పవన్‌కు పోసాని సంచలన సవాల్...

పవన్‌కు పోసాని సంచలన సవాల్...

'రూ.5కోట్లు ఇచ్చి ఆ అమ్మాయి నోరు మూయించే ప్రయత్నం చేశారు.దీంతో ఆమె మానసిక రోగంతో పిచ్చిదై... పిచ్చిదానిలా ఏడుస్తోంది. పవన్ కల్యాణ్ మీరు పవర్ స్టార్ కదా... ఆ పిల్ల పేరు మీ చెవిలో వేస్తా.మీ ఫోన్ నంబర్ పట్టుకుని మీకు చెబుతా. మీరు రండి.. ఆ అమ్మాయికి భరోసా ఇచ్చి... వాడిని సీబీఐకి అప్పగించండి.ప్రేమ పేరుతో ఆమెకు కడుపు చేసి అబార్షన్ చేయించాడు.కనీసం బతకు లేకుండా చేశాడు. ఆ దుర్మార్గుడిని పట్టించి అమ్మాయికి న్యాయం చేస్తే మీకు గుడి కడుతా. న్యాయం చేస్తారా... ఆ పిల్ల జీవితాన్ని బాగుచేస్తారా... అప్పుడు మీ ముందు జగన్ కూడా పనిచేయరు. ఒకవేళ మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోతే సీఎం జగన్‌ను,మంత్రులను ప్రశ్నించే హక్కు మీకు లేదు.ఎళ్లవయ్యవా పవన్ కల్యాణ్...నువ్వేంటో ప్రజలకు తెలుసు...అందుకే నీకెక్కడ కాల్చాలో అక్కడ కాల్చి ఇంట్లో కూర్చోబెట్టారు... నువ్వెప్పుడు జగన్‌తో పోల్చుకుంటావు... జీవితంలో ఆయనతో పోల్చదగ్గ వ్యక్తివి కాదు.'అని పోసాని పేర్కొన్నారు.

చిరంజీవి గారు ఎప్పుడైనా అలా తిట్టారా..

చిరంజీవి గారు ఎప్పుడైనా అలా తిట్టారా..

'సమాజం కోసం నేను మాట్లాడుతా అంటాడు తప్పేమీ లేదు.నేను కూడా వైసీపీ ప్రభుత్వం కోసం,జగన్ కోసం మాట్లాడుతాను. జగన్ నాకు ఏ పదవులు ఇస్తానన్న నేను తీసుకోలేదు.పార్టీ పెట్టకముందు నుంచే నేను ఆయన అభిమానిని.జగన్ ఎంపీగా నిలబడ్డప్పుడు కడప వెళ్లి పాంప్లెట్లు పంచి ప్రచారం చేశాను.ఈరోజు వరకు అదే అభిమానం జగన్‌పై ఉంది.చనిపోయేవరకు ఉంటుంది.జగన్ ఏదైనా పొరపాటు చేసినా ప్రశ్నించే హక్కు ఉంటుంది. వైఎస్సార్ ప్రభుత్వానికి కులపిచ్చి,మతగజ్జి ఉందని అన్యాయాలు,అక్రమాలు చేశారని ఆరోపిస్తే... సాక్ష్యాలు చెప్పించండి. అలా చేస్తే ఇన్నాళ్లు మేము తప్పుచేశాం ఇక జనసేనకే సపోర్ట్ చేస్తామని చెబుతాం. చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ప్రతిపక్ష నేతలను తిట్టడం మీరెప్పుడైనా చూశారా. మరి ఎవరిని ప్రేరణ తీసుకుని మీరిలా బూతులు తిడుతున్నారు.మీలాగే నాకు ప్రశ్నించే హక్కు ఉంది.' అని పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు.

రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయావ్...

రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయావ్...

'దురదృష్టం సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయింది. ఆయన మంచి నటుడు,త్వరగా కోలుకోవాలని చెప్పండి.కానీ సినిమా వేదికపై జగన్‌ను,మంత్రులను,ఎమ్మెల్యేలను సన్నాసుల్లారా,వెదవల్లారా అని తిట్టడమేంటి.దిల్ రాజు రెడ్డి,జగన్ రెడ్డి తేల్చుకోమని చెప్పడమేంటి. జగన్ పులివెందులకు వెళ్లకపోయినా అత్యధిక మెజారిటీతో గెలుస్తుంటారు.మీరు రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు. జగన్ 3600కి.మీ పాదయాత్ర చేసి... అదే చిరునవ్వుతో ఎండ్ చేశాడు.మీరు ఎండలో 5,10కి.మీ నడవలేక ఎండదెబ్బకు పడిపోయి భీమవరం ఆస్పత్రిలో చేరారు.జగన్ వచ్చి రెండేళ్లు కూడా కాలేదు.. రూ.60వేల కోట్లతో ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దారు.మౌలిక సదుపాయాలు కల్పించారు.చంద్రబాబులా విదేశీ టూర్లకు వెళ్లలేదు.' అని పోసాని కృష్ణమురళి పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

    గణేష్ నిమజ్జనోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్న భక్తులు!!
    ఇకనైనా విజ్ఞతతో మాట్లాడు : పోసాని

    ఇకనైనా విజ్ఞతతో మాట్లాడు : పోసాని

    చంద్రబాబు హయాంలో ముద్రగడ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడితే మీరు మాట్లాడారా,ఎస్సీ,ఎస్టీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అంటే మీరేమైనా మాట్లాడారా.. నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరించేస్తా అంటే ఎందుకు ఆయన్ను ప్రశ్నించలేదు... నీకు ప్రేమ ఉన్నప్పుడు చంద్రుడు,ఇంద్రుడు అయ్యాడు... ఆ తర్వాత వాళ్లను తిట్టావు... నువ్వు ప్రజల మనిషివి కావు... పరిశ్రమ మనిషివి కావు... ఇండస్ట్రీకి నన్ను నేను నమ్ముకుని వచ్చాను.చదువుకుని వచ్చాను.హోటల్లో కూలి పనిచేసైనా బతకగలను.సినిమాలు రావన్న భయం లేదు.ఇండస్ట్రీ పోసాని నువ్వు బ్యాన్ అంటే భయపడను.తెలుగు సినీ నిర్మాతలు అక్షయపాత్రలు.వారి పుణ్యానే ఇవాళ అన్నం తింటున్నాం అన్నం.చిరంజీవితో అభిప్రాయబేధాలు ఉన్నా ఆయన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు.ఎందుకంటే ఆయన ఏం చెప్పినా వింటారు.ఏమైనా నువ్వుమారవని తెలుసు.. కానీ ఇకనైనా కొంచెమైనా విజ్ఞతతో మాట్లాడు.' అంటూ పవన్ కల్యాణ్‌కు పోసాని హితబోధ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+