స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా కొలువుదీరిన కాషాయం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. కోల్ కత బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటైన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్వాతంత్ర్యం తర్వాత బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఇదే తొలిసారి. ఆ రాష్ట్ర చరిత్రలో చారిత్రక ఘట్టంగా నిలిచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు దీనికి హాజరయ్యారు. బెంగాల్ రాజకీయాల్లో చారిత్రక మార్పుల మధ్య బీజేపీ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అవకాశాన్ని సువేందు అధికారికి కల్పించింది. 2020లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకుడాయన.

2021 ఎన్నికల్లో బీజేపీ గెలిచివుంటే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆ హామీతోనే ఆయనను పార్టీలోకి చేర్చుకుంది బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్ గెలవడంతో అప్పుడాయనకు ఆ అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నమస్కరించారు.
అనంతరం వేదికపైనే ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, చంద్రబాబు.. ఇలా అందరినీ పలకరించారు. వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు సువేందు. ఆయనతో పాటు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తానియా, క్షుదిరామ్ తుడు, నితీష్ ప్రామాణిక్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications