మృగశిరలోకి శుక్రుడు.. మేషం, వృషభం, తులా రాశివారు నక్క తోక తొక్కినట్లే
జ్యోతిష్య శాస్త్రంలో సంపదకు, ఐశ్వర్యానికి, విలాసవంతమైన జీవితానికి, అందానికి, కళలకు, ఫ్యాషన్స్ కు కారకుడైన శుక్రుడు, కుజుడి ఆధిపత్యంలోని మృగశిర నక్షత్రంలో అడుగుపెట్టడం ఒక కీలక పరిణామం. ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టం మోసుకొస్తోంది. మే 9 నుండి మే 17 వరకు కొనసాగే ఈ సమయంలో మూడు రాశులవారు అనూహ్య లాభాలు పొంది ఆర్థికంగా స్థిరపడుతున్నారు.
గ్రహాలు రాశిని మార్చినప్పుడే కాదు, నక్షత్ర సంచారం చేసినప్పుడు కూడా మానవ జీవితంపై అత్యంత ప్రభావం చూపుతాయి. మే 17వ తేదీ వరకు శుక్రుడు మృగశిర నక్షత్రంలోనే సంచరించనుండటంతో మూడు రాశులకు గోల్డెన్ పిరియడ్ ప్రారంభమవుతోంది. 17లోగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటే చాలు.. కోటీశ్వరులైపోతారు.

మేష రాశి వారికి పెరగనున్న ఆదాయం
మేష రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా చాలా బలంగా ఉండబోతోంది. ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రాధాన్యత పెరుగుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. భాగస్వామితో ఉన్న చిన్న చిన్న గొడవలు సమసిపోయి, అనుబంధం బలపడుతుంది.
వృషభ రాశి వారికి కెరీర్‌లో భారీ మలుపు
శుక్రుడి అనుగ్రహంతో వృషభ రాశి వారి జాతకం అద్భుతంగా మారనుంది. మీరు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు విజయవంతం కావడమే కాకుండా, భారీ లాభాలను తెచ్చిపెడతాయి. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు చేస్తారు. మీ ప్రవర్తనతో తోటివారిని ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో ఉన్న అపార్ధాలు తొలగి, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
తులా రాశి వారికి పదోన్నతులున్నాయి
తులా రాశి వారికి శుక్రుడు రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాడు. వీరికి పదోన్నతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వేతనం పెరగడంతో పాటు సామాజిక హోదా కూడా పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయం కలసివస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.












Click it and Unblock the Notifications